రామ్‌చరన్ తేజ్‌కు తండ్రి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ప్రమో ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు. నాన్న అంత గొప్పగా కాకపోయిన ఆయన పేరు చెడగొట్టకుండా ఉంటే ఈ జన్మకు అది చాలు అని ఒక ఆడియో ఫంక్షన్ల్లో చరణ్ అన్నాడంటేనే అర్థమవుంది తండ్రి అంటే ఎంత గౌరవమో. మెగాస్టార్ చిరంజీవి కొడుకు అభిమానమే కాకుండా కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సంపాదించారు. దానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. 43 ఏళ్ల క్రితం 1978 సెప్టెంబర్ 22 ఆయన తొలి చిత్రం ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది. ఆయన మొదట పునాదిరాళ్లు సినిమాలో నటించిన కొన్ని కారణాల వల్ల అది 1979లో రిలీజ్ అయ్యింది.
మెగాస్టార్ మొదటి సినిమాగా నిలిచిపోయిన ప్రాణం ఖరీదు రిలీజ్ అయి 43 ఏళ్లు అయిన సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఆయన ట్వీట్టర్ ఖాతాలో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. అందులో కెరీర్ మొదట్లో ఉన్న యంగ్ అండ్ ఎనర్జీటిక్ చిరంజీవి, పక్కన సినీ సామ్రాజ్యాన్ని ఏలుతూ 153వ చిత్రం ఆచార్యలోని స్టిల్ పెట్టారు. ‘43 ఏళ్లుగా కొనసాగుతున్నారు.. మై అప్ప(నాన్న)’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. చిరంజీవి సినీ ప్రయాణం అసామాన్యం. ఎంతో మందికి ఆయన జీవితం స్ఫూర్తి దాయకం. ఆయన వేసిన బాటలో నడుస్తూ ఇప్పటికే డజనమంది సినిమాల్లో రాణిస్తున్నారు. బలంగా ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకుని దాని కోసం కష్టపడి అనుకున్న దాన్ని సాధించి దాంతో నలుగురి ఎలా సహాయం చేయాలో చెప్పేందుకు చిరు జీవితం ఒక మంచి ఉదాహరణ. మెగాస్టార్ అంటే అదేదో బిరుదులా అనిపించదు సొంతమనిషిని పేరుపెట్టి పిలిచినట్లు ఉంటుంది ఆయన అభిమానులకు. వందేళ్లు ఆయన ఇలానే సినిమాలు చేస్తూ తనను అలరించాలని ఆయన అభిమానులు చెర్రీ పోస్టు కామెంట్లు పెడ్తున్నారు.
43 years and still counting!
My Appa @KChiruTweets ❤️ pic.twitter.com/2th29femzz— Ram Charan (@AlwaysRamCharan) September 23, 2021