మెగా ఫ్యామిలీకి అన్ని శుభవార్తలే వినిపిస్తున్నాయి. త్వరలోనే మెగాస్టార్ ఇంట వారసుడో.. వారసురాలో రాబోతుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం మన దేశంలో పాన్ ఇండియా లెవల్లో.. సత్తా చాటి.. ఆయనను పాన్ ఇండియా హీరోగా నిలపడమే కాక.. విదేశాల్లో కూడా సత్తా చాటుతోంది. వరుస ప్రాజెక్ట్‌లతో చెర్రి బిజీగా ఉన్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం.. వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది. చరణ్‌కి మరో అరుదైన ఆహ్వానం అందింది. త్వరలో అహ్మదాబాద్‌లో అత్యంత ఘనంగా జరగనున్న ఆధ్యాత్మిక వేడుక PSM 100కి రావాలంటూ చరణ్‌కు ఆహ్వానం అందింది.
PSM 100 అంటే ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది వేడుకలను PSM 100 పేరిట నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనాలంటూ మెగా పవర్‌స్టార్‌కి స్వామీజీల నుంచి ప్రత్యేకమైన ఆహ్వానం అందింది. ఇక ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీలు కూడా పాల్గొనబోతున్నారు. ప్రధాని, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అయిన వ్యక్తులతో.. రామ్ చరణ్ వేదికను పంచుకోబోతున్నారు. ఇక అహ్మదాబాద్‌లోని స్వామి మహరాజ్ నగర్‌లో.. సుమారు 600 ఎకరాల స్థలంలో PSM 100 ఆధ్యాత్మిక వేడుకలను డిసెంబర్ 15 నుంచి జనవరి 23 వరకు ఎంతో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఇలాంటి వేడుకకు రామ్ చరణ్‌ని ఆహ్వానించడం చాలా అరుదైన విషయం అంటూ మెగా ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ వరుస క్రేజీ ప్రాజెక్టులను అది కూడా పాన్ ఇండియా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇక ప్రస్తుతం RRR సినిమా ఆస్కార్ బరిలోకి దిగటానికి సిద్ధమవుతుంది. అంత కంటే ముందే ఆర్‌ఆర్‌ఆర్‌కు పలు అంతర్జాతీయ అవార్డులు దక్కుతున్నాయి. ఈ సక్సెస్‌ను రామ్ చరణ్ సహా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మరో వైపు చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయటానికి మేకర్స్ ప్రయ్నతిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రి సరసన.. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరి చరణ్‌కి అందిన ఈ అరుదైన ఆహ్వానం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.