సినీ ప్రపంచంలో కనిపించేవన్నీ కల్పితాలే.. అయినప్పటికీ అవి కల్పితాలు కాదని అనిపించే ఫీల్ ని కలిగిస్తుంటారు మేకర్స్. చిన్న సినిమాల సంగతి పక్కన పెడితే.. స్టార్ హీరోల సినిమాలలో భారీ యాక్షన్ సీక్వెన్సులు, కళ్లు చెదిరే విజువల్ ఎపిసోడ్స్ మనం చూస్తూ ఉంటాం. అయితే.. విజువల్ ఎఫెక్ట్స్ అనేవి భారీ పోరాట ఘట్టాలకు, గాల్లో ఎగిరి చేసే ఫైట్స్, విన్యాసాల కోసం ఉపయోగించారంటే అది వేరు. కానీ.. హీరో సైకిల్ తొక్కుకుంటూ వెళ్లే సీన్ కూడా గ్రీన్ మ్యాట్ లో షూట్ చేయడమనేది కొత్తగా అనిపిస్తుంది.
అవును.. ఓ సినిమాలో స్టార్ హీరో సైకిల్ తొక్కుకుంటూ వెళ్లే సన్నివేశాన్ని గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసి.. థియేటర్ లో ప్రేక్షకుల చేత జయహో అనిపించుకున్న దర్శకుడు సుకుమార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆయన తెరకెక్కించిన చిత్రం ‘రంగస్థలం’. 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే.. తాజాగా రంగస్థలం సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్(VFX) మేకింగ్ వీడియో వైరల్ అవుతోంది.
సాధారణంగా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అనేది అన్ని సినిమాల విషయంలో జరుగుతుంది. అయితే.. పాన్ ఇండియా స్థాయి సినిమాలంటే.. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించాలి. కాబట్టి విజువల్స్ తో అద్భుతాలు సృష్టించారని అనుకోవచ్చు. కానీ.. దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమా విషయంలోనే విజువల్స్ తో ఆటాడుకోవడం మనం వీడియోలో చూడవచ్చు. రంగస్థలం మూవీలో హీరో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది. రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వస్తుండగా ఎదురుగా కారు యాక్సిడెంట్ అవుతుంది.
ఈ సీన్ చూసి అందరూ చరణ్ సైకిల్ తొక్కే విధానం అదిరిపోయిందని అనుకున్నారు. కానీ.. ఆ సన్నివేశం ఒరిజినల్ గా స్టాండ్ వేసిన సైకిల్ పై షూట్చ్ చేశారని ఎంతమందికి తెలుసు. వినడానికి కొత్తగా అనిపించినా ఇదే నిజం. చరణ్ స్టాండ్ వేసిన సైకిల్ తొక్కడం.. ఆ సీన్ తెచ్చి సినిమాలో గ్రాండ్ గా ప్రెజెంట్ చేయడంతో ఆహా ఓహో అనుకున్నాం. ఇప్పుడు విజువల్స్ వర్క్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీంతో ఈ సినిమాలో చాలా సన్నివేశాలు గ్రాఫిక్స్ లో డిజైన్ చేశారు. మరి రంగస్థలం విఎఫ్ఎక్స్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.