సినీ ప్రపంచంలో జేమ్స్‌బాండ్ పాత్రకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. జేమ్స్ బాండ్ సినిమాలంటే కోట్ల సంఖ్యలో ఆడియెన్స్ థియేటర్లకు పరిగెడతారు. అయితే.. డానియెల్ క్రెయిగ్ తర్వాత జేమ్స్ బాండ్ గా ఎవరు కనిపించబోతున్నారు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో జేమ్స్ బాండ్ పాత్రకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చక్కగా సరిపోతాడని మార్వెల్ ‘ల్యూక్ కేజ్’ టెలివిజన్ సిరీస్ సృష్టికర్త చియో హోదరి కోకర్ అన్నారు.
ప్రస్తుతం కోకర్ రామ్ చరణ్ ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతేడాది విడుదలైన ‘నో టైమ్ టు డై’ చిత్రం తర్వాత జేమ్స్‌బాండ్ పాత్ర నుంచి రిటైర్ అవుతున్నట్లు హీరో డేనియల్ క్రెయిగ్ ప్రకటించారు. దీంతో అప్పటినుండి తదుపరి జేమ్స్ బాండ్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఈ ఏడాది విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రామ్ చరణ్ నటన చూసి.. జేమ్స్ బాండ్ పాత్రకు బాగా సెట్ అవుతాడని కోకర్ ట్వీట్ చేశారు.
అదేవిధంగా జేమ్స్ బాండ్ పాత్రకు సూట్ అవుతారని అనిపించిన వారి పేర్లను ట్వీట్ లో పేర్కొన్నారు కోకర్. “బాండ్ పాత్రకు పోటీలో ఇడ్రిస్ ఎల్బా, ‘గ్యాంగ్స్ ఆఫ్ లండన్’లో నటించిన సోపె డిరిసు, ‘ద ఆఫర్’ నటుడు మాథ్యూ జి, ‘స్నోఫాల్’ సిరీస్‌తో ఆకట్టుకున్న డామ్సన్ ఇడ్రిస్, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని రామ్ చరణ్.. జేమ్స్‌బాండ్ సూట్ వేసుకుని ‘వాల్థర్ పిపికె’ పిస్టల్‌తో కెమేరా ముందు యాక్షన్ చేయడానికి బాగా సూట్ అవుతారు” అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు కోకర్.
ఇక ఇప్పటికే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ‘డాక్టర్ స్ట్రేంజ్’ స్క్రీన్ రైటర్ రాబర్ట్ కార్గిల్, మార్వెల్ కామిక్స్ ‘కెప్టెన్ అమెరికా అండ్ కాంగ్’ రచయిత జాక్సన్ లాంజింగ్ ప్రశంసలు కురిపించిన విషయం విదితమే. ఈ విషయాన్ని నేషనల్ మీడియాలు సైతం గతంలో తెలిపాయి. ఈ ఏడాది మార్చి 25న రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’.. మొత్తంగా రూ. 1,200 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం.
ఇప్పుడు కోకర్ ట్వీట్ వైరల్ అవుతుండటంతో.. ఆ ట్వీట్ చూసిన మెగా ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో పండగ చేసుకున్నారు. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటు, ఆయన గత చిత్రాల స్టిల్స్ షేర్ చేశారు. అంతేగాక నో టైమ్ టు డై సినిమా పోస్టర్ మీద డేనియల్ క్రెయిగ్ కు బదులుగా రామ్ చరణ్‌ను చూపిస్తూ చేసిన గ్రాఫికల్ పోస్టర్ వైరలైపోయింది. జేమ్స్‌బాండ్‌గా తన 16 ఏళ్ల కెరియర్‌కు ముగింపు పలుకుతున్నానని డేనియల్ క్రెయిగ్ గతేడాది ప్రకటించారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి.
Damn! That escalated quickly. Everyone knows Idris from, well, everything, but to get inside my thinking, watch Sope in “Gangs Of London,” Matthew G in “The Offer”, Damson in “Snowfall” and Ram in “RRR”. They all deserve a shot at a Savile Row suit and a Walther PPK. https://t.co/8ZGV4UFd9P
— Cheo Hodari Coker (@cheo_coker) July 27, 2022
Marvel’s ‘Luke Cage’ creator thinks Ram Charan will be suitable for James Bond’s role
Read @ANI Story | https://t.co/X4AmYulkeS#Marvel #LukeCage #RamCharan #JamesBond pic.twitter.com/23ui7mNRgq
— ANI Digital (@ani_digital) July 28, 2022
Bond!! John wick!! Capitan America!! Wolverine!! 💥👌🏻✌🏻
Western audiences wish to see #Ramcharan in a MARVEL Superhero role!! That’s what they expressed after watching #RRRMovie, Global Star ❤💥@AlwaysRamCharan pic.twitter.com/AKIAF9XMdX
— Sᴀɱ JօղVíƙ™ (@Sam_Jonvik2) July 29, 2022
Tried editing Our @AlwaysRamCharan as #JamesBond ..Ignore if bad.#RamCharan #Indra #RC16 #RC15 #MegaPowerStar #MegastarChiranjeevi #PawanKalyan #Janasena #VikrantRonaTomorrow #LaalSinghChadha #TheLegendmovie pic.twitter.com/larxm9FfTt
— Megang (@alwayZ_chandu) July 27, 2022