యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలుగా RRR మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో ఈ మూవీని దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దాదాపుగా రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటులు అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి స్టార్‌లు నటిస్తున్నారు. దీంతో RRR మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొంటున్నాయి.
ఇక ఇటీవల విడుదల చేసిన దోస్తీ సాంగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా కొంత షూటింగ్ నిమిత్తం RRR మూవీ యూనిట్ ఉక్రెయిన్ వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా రాజమౌళి ఉక్రెయిన్‌లో జరగాల్సిన షూటింగ్ మొత్తాన్ని కంప్లింట్ చేశారట. ఈ సందర్భంగా రాజమౌళి కేక్‌ను సైతం కట్ చేసి ఫోటోలను విడుదల చేశారు. ఈ చిత్రం దాదాపుగా షూటింగ్ మొత్తం కూడా కంప్లిట్ అయినట్లు తెలుస్తోంది.
ఇక మొదట్లో ఈ సినిమాని ఈ ఏడాది 13 అక్టోబర్‌న విడదల చేస్తామని ప్రకటించారు. కానీ పరిస్థితులు చూస్తుంటే మళ్లి రిలీజ్ డేట్ మార్చనున్నట్లు ఫీల్మ్‌నగర్‌లో ప్రచారం మాత్రం జరుగుతోంది. ఇక ఈ సినిమా తెలుగు, మళయాళం, తమిళం, హింది వంటి భాషల్లోనే కాకుండా మరిన్ని భాషల్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో జక్కన్న అనుకున్న తేదీకే ఈ మూవీని రిలీజ్ చేస్తాడా? లేదంటే మరో తేదీకి మారుస్తాడన్నది ఇంకా తెలియాల్సి ఉంది.