తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది బాహుబలి సిరీస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మాస్టర్ పీస్ విడుదలైన అన్ని భాషలలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిన బాహుబలి సినిమా.. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన మొదటి ఇండియన్ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. అయితే.. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 తర్వాత అందరిలో మెదులుతున్న ప్రశ్న బాహుబలి-3 ఉంటుందా.. ఎప్పుడు?
ఇది చదవండి: బాహుబలి-3 పై రాజమౌళి క్రేజీ అప్డేట్..!
ఈ ప్రశ్న చాలాసార్లు ఫేస్ చేశారు దర్శక నిర్మాతలు. బాహుబలి 3 పై ఇదివరకు రాజమౌళి కూడా స్పందించాడు. ఖచ్చితంగా ఉంటుంది కానీ వివరాలు ఇప్పట్లో చెప్పలేం అన్నాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘RRR‘. పీరియాడిక్ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అయితే.. తాజాగా RRR ప్రమోషన్స్ లో కూడా రాజమౌళి బాహుబలి 3 ప్రశ్నను ఎదుర్కొన్నాడు.ఇక తాజాగా బాహుబలి 3 పై స్పందించిన రాజమౌళి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వినిపించారు. బాహుబలి-3 పై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో వదిలారు. రాజమౌళి స్పందిస్తూ… ‘బహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలను చూస్తూనే ఉన్నాం. బాహుబలి పార్ట్ 3 పై ఆలోచన చేస్తున్నాం. నిర్మాత శోభు కూడా పార్ట్ 3 గురించి సుముఖంగా ఉన్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. కానీ తప్పకుండా ఆసక్తికరమైన వార్త మాత్రం రాబోతుంది’ అని చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి బాహుబలి-3 పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.