సినిమా ఇండస్ట్రీపై చాలా మందికి రకరకాల అభిప్రాయలు ఉంటాయి. ఇక కొందరికి మంచి అభిప్రాయం ఉంటే.. మరికొందరికి చెడు అభిప్రాయాలు ఉంటాయి. దాంతో పరిశ్రమలోని సెలబ్రిటీస్ పై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తుంటారు. ఆ విమర్శలు ఒక్కోసారి బాధించక పోవచ్చు గానీ కొన్ని సార్లు మాత్రం మనోవేదనకు గురిచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా మనోవేదనలో ఉన్న వారికి మాట సాయం అందించడం ఓ వ్యక్తి చేసే మంచిపని. అలాంటి సాయంమే సమంతకు చేశాడు ఓయువ డైరెక్టర్ కమ్ యాక్టర్. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంతకు ఓ పోస్ట్ తో కూడిన ఫ్రేమ్ ను అందించాడు అతడు. దానిని తన ఇన్ స్టా లో షేర్ చేసింది సమంత. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.
సమంత.. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తూ.. అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతోంది. అయితే గత కొంత కాలంగా మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే తాజాగా విడుదలైన ‘యశోద’ మూవీకి డబ్బింగ్ చెప్పింది. ఇక ఈ వ్యాధి కారణంగా ఒకానొవ దశలో నేను అడుగు ముందుకు వేస్తానో లేదో.. అన్న సందేహాన్ని ఓ ఇంటర్య్వూలో వ్యక్తం చేసింది. అయినప్పటికీ తాను ఈ యుద్ధంలో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది సామ్. తాజాగా సామ్ పోరాటాన్ని అభినందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు రాసుకొచ్చాడు నటుడు, దర్శకుడు రాహుల్ రవింద్రన్. తన మాటలతో సమంతకు ఓదార్పును ఇచ్చాడు. ఆమెను పోరాటయోధురాలిగా, ఉక్కు మనిషితో పోల్చాడు. రాహుల్ .. సమంత గురించి ఈ విధంగా రాసుకొచ్చాడు.
“సామ్ నీ ప్రయాణంలో నీకు భయం వేస్తుండొచ్చు.. నువ్వు నడిచే దారి చీకటిగా ఉండొచ్చు. నీ గమ్యం కూడా నీకు కనిపించకపోవచ్చు. అదీకాక ఎన్నో అనుమానాలు వస్తాయి కూడా. అయితే ఒకటి గుర్తుంచుకో సామ్. నువ్వు ఉక్కు మహిళవి, నువ్వో పోరాట యోధురాలివి.. నిన్ను ఏదీ ఒడించలేదు” అంటూ రాసుకొచ్చిన ఓ ఫ్రేమ్ ను సమంతకు గిఫ్ట్ గా పంపిచాడు రాహుల్. దానిని సమంత తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. రాహుల్ రవీంద్రన్ కు ధన్యవాదాలు తెలిపింది. రాహుల్ భార్య చిన్మయి శ్రీపాద, సమంత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని మనందరికి తెలిసిందే. అలా రాహుల్ కూడా సామ్ కు స్నేహితుడుగా మారాడు. ఆ అనుబంధం కారణంగానే ఈ మాటలు రాసుకొచ్చాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.