కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం సినీ రంగాన్నే కాదు.. సాధారణ ప్రజలను సైం కలచివేసింది. దక్షిణాది సినిమా రంగాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. అసలు అది చనిపోయే వయసా? అంటూ కన్నీరుమున్నీరైన తారలు ఎందరో. ఇక పునీత్ చేసిన సమాజిక సేవలతో అతనికి అభిమానులుగా మారిన వారు కోకొల్లలు. చనిపోతూ కూడా అతని కళ్లతో నలుగురికి చూపును తెప్పించాడు పునీత్. అతను చేస్తున్న సేవల్లో ఏ ఒక్కటి నేను చేసినా చాలు అంటూ.. 1800 మంది విద్యార్థుల బాధ్యత విశాల్ తీసుకున్న విషయం తెలిసిందే. అలా ఎందరికో స్ఫూర్తిగా పునీత్ జీవితం నిలుస్తుంది. మంగళవారం పాల శాస్త్రం పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు.. బుధవారం నుంచి పునీత్ సమాధిని సందర్శించేందుకు అనుమతిచ్చారు. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలు రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది.
జిమ్ చేస్తూ పునీత్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు.. ఒక్కసారిగా కుప్పకూలారు అని వచ్చిన వార్తలు అవాస్తవమని గతంలోనే కొందరు ఖండించారు. ఆయన జేమ్స్ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న శ్రీకాంత్ కూడా ఆ వార్తలను కొట్టిపారేశారు. ఏదో అనీజాగా ఉందని భార్య అశ్వినీతో కలిసి పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లారు. వీడియోలో కూడా ఎంతో క్యాజువల్‌గా పునీత్ వెళ్తుండటం చూడచ్చు. అక్కడ ఈసీజీ తీసిన వైద్యుడు రమణారావు సమస్యను పసిగట్టి విక్రమ్ ఆస్పత్రి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. వెంటనే ఆస్పత్రికి బయల్దేరగా దారిలోనే భార్య ఒడిలోకి జారిపోయి పునీత్ స్పృహ కోల్పోయారు. విక్రమ్ ఆస్పత్రికి చేరుకునే సరికే పునీత్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పునీత్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.