కొన్ని రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పెట్టుబడులు పెట్టారు అన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. ఇక ఈ వార్తలపై తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చారు నిర్మాత దానయ్య.
టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించిన చిత్రం ఆర్ఆర్ఆర్. వసూళ్లతో పాటుగా నాటునాటు సాంగ్ కు ఆస్కార్ రావడంతో.. టాలీవుడ్ ఖ్యాతి హాలీవుడ్ వరకు విస్తరించింది. ఇక ఇంతటి భారీ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత DVV దానయ్య ఆస్కార్ వేడుకల్లో కనిపించకపోవడంతో పలు రకాల వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలతో పాటుగా మరో వార్త కూడా ఇండస్ట్రీలో కొన్ని రోజుల క్రితం హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పెట్టుబడులు పెట్టారు అన్న వార్త. ఈ వార్తలపై తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు నిర్మాత దానయ్య.
RRR, నాటునాటు గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా వినిపించిన పేర్లు. ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటునాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో.. భారతీయులందరు పులకించిపోయారు. అయితే ఆస్కార్ వేడుకల్లో చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనితో పాటుగా ఆర్ఆర్ఆర్ లో మెగాస్టార్ చిరంజీవి పెట్టుబడులు పెట్టారు అని వార్తలు అప్పట్లో హల్ చల్ చేశాయి. ఇక ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు దానయ్య. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో పై ప్రశ్నలకు పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పెట్టుబడి పెట్టారా? అని సీనియర్ జర్నలిస్టు ప్రభు ప్రశ్న అడగగా.. నిర్మాత దానయ్య సమాధానం ఇచ్చారు.
“అసలు ఎవరైనా ఈ విషయాన్ని నమ్ముతారా? ఆయన నాకు పెట్టుబడి పెట్టడం ఏంటి? ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అనుకుంటూ ఆయన కొడుకు రామ్ చరణ్ కు పెడతారు. ఇక నేను నిర్మాతను, నా పెట్టుబడి అంతా నా ఫైనాన్సియర్లే. నేను కొద్ది మెుత్తంలో డబ్బులు పెడతాను, మిగతావి వారి దగ్గర వడ్డీకి తీసుకొస్తాం. అసలు ఈ వార్తలు రాసిన వాడిని నా దగ్గరకు తీసుకురండీ, వాడేమైనా నా టేబుల్ దగ్గరికి వచ్చి చూశాడా? లేక నా బ్యాంక్ అకౌంట్స్ చూశాడా?” అంటూ సమాధానం ఇచ్చారు దానయ్య. ఇక చిరంజీవి సినిమా తియ్యాలి అంటే ఆయన సొంత బ్యానర్ లో తీస్తారుగా, ఈ మాత్రం తెలీదా ఆ వార్తలు రాసిన వాడికి, మైండ్ లేని వాళ్లే ఇలాంటి రాతలు రాస్తారు అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు నిర్మాత దానయ్య. ఇక ఆస్కార్ వేడుకల్లో కనిపించకపోవడంపై కూడా క్లారిటీ ఇచ్చారు. నాకు ఆర్ఆర్ఆర్ టీమ్ మెుత్తం మంచి గౌరవాన్ని ఇచ్చారు. మా మధ్య గొడవలు ఏం లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు దానయ్య. ఇక మెగాస్టార్ తో సినిమా చేయాలని ఉందని, మంచి కథ కోసం చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.