‘ది వైట్ టైగర్’ ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ ఖ్యాతిని హాలీవుడ్ లో చాటింది అనడంలో సందేహం లేదు. భారత్ నుంచి ఒక ఆర్టిస్ట్ గా హాలీవుడ్ లో అడుగుపెట్టి.. పెద్ద తారగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం. ప్రియాంక చోప్రా ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ‘మ్యాట్రిక్స్ రీసరెక్షన్స్’ చిత్రంలో సందడి చేయనుంది. ఆ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంది. ప్రమోషన్స్ కు సంబంధించిన వార్తలు కవర్ చేసే విషయంలో ప్రియాంక చోప్రా ఒక విషయంలో బాగా హర్ట్ అయ్యింది. గుడ్ మార్నింగ్ అమెరికా న్యూస్ రిపోర్ట్ లో ‘ప్రియాంక చోప్రా వైఫ్ ఆఫ్ నిక్ జోనస్’ అంటూ రాయడాన్ని ప్రియాంక విభేదించింది. అక్కడితో ఆగకుడా తనదైన స్టైల్ లో ఆ రిపోర్టర్ కు కౌంటర్ కూడా ఇచ్చింది ప్రియాంక చోప్రా.
‘నేను ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ సినిమా ఫ్రాంచైజ్ కు ప్రమోట్ చేస్తున్నా. కానీ, ఇప్పటికీ నన్ను నిక్ జోనస్ వైఫ్ అంటూ సంభోదిస్తున్నారు? మీరు ఈ విషయాన్ని నాకు అర్థమయ్యేలా చెప్పగలరా? మహిళలకు ఇంకా ఎందుకు ఇలా జరుగుతోంది? నేను IMDB లింక్ ను నా బయోకి జత చేయాలా?’ అంటూ ప్రియాంక చోప్రా తన ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ పోస్ట్ చేసింది. ఇప్పుడు ప్రియాంక అడిగిన ప్రశ్నలను సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రియాంక చోప్రా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.