బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక చోప్రా. తన అందం, అభినయంతో యువత మనసుల్లో చెరగని ముద్ర వేశారు. తాజాగా ఈ భామ.. తన భర్త నిక్ జోనాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక చోప్రా. తన అందం, అభినయంతో యువత మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకున్న ఈ భామ సినీ ఇండస్ట్రీలో చాలా మందితో ప్రేమాయణం కొనసాగించింది. కానీ అవేమీ పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తరువాత యుఎస్ కు చెందిన నిక్ జోనస్ ను లవ్వాడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. తాజాగా ప్రియాంక చోప్రా తన భర్త గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ.. తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మరపురాని అనుభూతులను పంచుతాయని తెలిపారు. తాను చాలామందితో డేటింగ్ చేశానని ఇన్ని రిలేషన్ లలో ఒక్కటి కూడా పెళ్లి దాక రాలేదని తెలిపింది. ఆ తరువాత నిక్ జోనస్ తో పరిచయం ఏర్పడిందని తెలిపింది. నిక్ జోనస్ కు కూడా చాలా మందితో లవ్ ఎఫైర్స్ ఉన్నాయని తెలిపింది.
నిక్ తో పరిచయం కాస్త ప్రేమగా మారిందని, మా ఇద్దరి అభిరుచులు కలిశాయని చెప్పింది. అతడి గత విషయాల కంటే తనతో భవిష్యత్తు పంచుకోవడం ముఖ్యమని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. వయసులో తన కంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనాస్ గురించి మరిన్ని విషయాలను తెలిపింది. 2018లో ప్రియాంక చోప్రా.. నిక్ జోనాస్ ను వివాహమాడారు. అతడి గురించి మాట్లాడుతూ.. 2000వ సంవత్సరంలో తాను ప్రపంచ సుందరిగా గెలిచినప్పుడు.. తన వయసు 17 ఏళ్లని తెలిపింది.
అలానే అప్పటికి తనకు బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలియదని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. అదే సమయంలో తన భర్త అయిన నిక్ జోనస్ వయసు ఏడు సంవత్సరాలని తెలిపింది. ఆ ఏడేళ్ల వయసులో నిక్ చాలా క్యూట్ గా ఉన్నాడని ఆమె తెలిపింది. వయసు పరంగా ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికి మేమిద్దరం ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం అని తెలిపారు. వీరి ప్రేమ పెళ్లి కి ప్రతిరూపంగా మాల్తీ అనే కూతురు జన్మించింది. మరి.. ప్రియాంక చోప్రా కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.