హీరోయిన్‌లకు అందం, అభినయంతో పాటు కూసింత అదృష్టం కూడా ఉండాలి. అలా అయితేనే ఇండస్ట్రీలో నెగ్గుకురాగలుగుతారు. లేదంటే రెండు,మూడు సినిమాలతో కెరీర్ ఎండ్ అయిపోతుంది.
సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు సక్సెస్ సాధించాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అసలు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఉన్నవారు ఇండస్ట్రీలో ఎదగాలంటే మాత్రం అంతకు మించిన సుడి ఉండాలి. పైన ఫొటోలు కనిపిస్తున్న చిన్నారికి సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదు. మొదట్లో టీవీ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా జీవితాన్ని ప్రారంభించింది. తర్వాతి కాలంలో సీరియల్ నటిగా మారింది. సీరియల్స్ చేస్తూ బుల్లి తెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాతి కాలంలో వెండి తెరపైకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగింది.
మొదటి సినిమాతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2017లో వచ్చిన ‘మేయాద మాన్’ సినిమాతో పరిశ్రమలోకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నటిగా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తర్వాతి కాలంలో ఆమెకు వరుస ఆఫర్లు రావటం మొదలయ్యాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తెలుగు, తమిళం భాషల్లో సినిమాలు చేస్తోంది. పై ఫొటోలో ఉన్న అమ్మాయి ఇంకెవరో కాదు..
ప్రముఖ హీరోయిన్ ప్రియా భవాని శంకర్. తెలుగులో ఆమె తీసింది రెండు సినిమాలే అయినా.. డబ్బింగ్ సినిమాలతో సుపరిచితమే. ఆమె తెలుగులో ‘కల్యాణం కమనీయం’ సినిమాలో నటించారు. ప్రస్తుతం ‘జీబ్రా’ అనే సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అంతేకాదు! ఆమె దూత అనే తెలుగు వెబ్ సిరీస్‌లోనూ నటించారు. తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ప్రియ పలు తమిళ సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2లోనూ ఆమె నటిస్తున్నారు.