కొంత కాలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలదన్నేలా కొనసాగుతున్నాయి. గత ఏడాది జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మద్య పోటీ రసవత్తరంగా సాగింది. ‘మా’ఎన్నికలో వివాదాలు, విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు ఇలా ఎన్నో ట్విస్ట్ ల మద్య సాగిన ఎన్నికల్లో భారీస్థాయిలో పోలింగ్ జరిగింది. నువ్వా నేనా అనే రీతిలో సాగిన ఎన్నికలో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు. ఇటీవల మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికై ఒక సంవత్సరం గడిచిన నేపథ్యంతో పలు విషయాలు మీడియా వేధికగా వెల్లడించారు.
ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న ప్రకాశ్ రాజ్ తాజాగా మూవీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పనితీరుపై స్పందించారు. ఇండస్ట్రీ విషయంలో ఎలాంటి విభేదాలు ఉండబోవు… మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై ఒక ఏడాది అవుతుంది.. ఆయన సమర్థవంతంగా పని చేశారా? లేదా అనేది సభ్యులకు తెలుసు.. ఆయనతో ఎన్నికైన వాళ్లకు ఈ విషయంపై అవగాహన ఉంటుంది.. ఎందుకంటే అసోసియేషన్ కి సంబంధించిన ప్రతి విషయంలో వారికి బాధ్యత ఉంటుంది అన్నారు.
ఇటీవల మా అధ్యక్షుడిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న మంచు విష్ణు ‘మా’ కోసం ఎన్నో పనులు పూర్తిచేశామన్నారు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. మా అధ్యక్షుడిగా 90 శాతం పనులు పూర్తి చేశామని ప్రకటించడం వల్ల ఆ పనులు సంపూర్ణంగా పూర్తి అయినట్లు కాదు కదా? మంచు విష్ణు పదవి ఇంకా ఏడాది కాలం ఉంది.. మా అసోసియేషన్ కోసం ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. ఏమేం చేస్తారో చూద్దామని అన్నారు. వచ్చే ఏడాది మళ్లీ మీరు పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఏమో ఆ విషయం గురించి ఆలోచించలేదు.. సమయం ఉంది కదా అంటూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు ప్రకాశ్ రాజ్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Prakashraj: ‘మా’ పనితీరుపై స్పందించిన ప్రకాశ్‌రాజ్#PrakashRaj #Maa #Tollywood #TeluguNews #Hyderabad pic.twitter.com/jLjuhH1K7p
— Eenadu (@eenadulivenews) October 28, 2022
ఇది చదవండి: ఇది బాలయ్య రేంజ్.. తొలి యాడ్కే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్!