ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు తమిళంతో పాటు తెలుగులోనూ మారుమోగుతున్న దర్శకుడు, నటుడి పేరిది. ‘‘లవ్ టుడే’’ అన్న ఒక్క సినిమా ప్రదీప్‌ను ఓ స్థాయిలో నిలబెట్టింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఎంతో మంది జీవితాలకు ఈ సినిమా ఓ నిలువు టద్దంలా నిలిచింది. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయారు. సినిమా విషయం పక్కన పెడితే.. ప్రదీప్ రంగనాథ్ తరచుగా వివాదాల్లో నిలవటం మామూలైపోయింది. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలో. ప్రదీప్ మొదటి సినిమా ‘కోమాలి’లో రజినీ రాజకీయాల గురించి ప్రస్తావించారు. దీంతో ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదీప్ సంజాయిషీ ఇవ్వటంతో వివాదం సద్దు మణిగింది.
అయితే, ‘లవ్ టుడే’ సినిమా విజయం సాధించిన తర్వాత.. రజినీకాంత్.. ప్రదీప్‌ను ఇంటికి పిలిపించుకున్నారు. ప్రదీప్‌కు సన్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రదీప్.. రజినీకాంత్‌ను డైరెక్ట్ చేయబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. కొంతమంది ఆ సినిమాకు పేరు కూడా పెట్టేశారు. ‘‘ జాయింట్ జగదీశన్’’ అని నామకరణం చేశారు. ఈ సినిమా పేరుతో సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్, పేరడీ పోస్టర్స్ రావటం మొదలయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో ప్రదీప్ ఈ మీమ్స్, పేరడీ పోస్టర్స్‌పై స్పందించారు. వాటి గురించి తనకు తెలుసునని అన్నారు. తాజాగా, ‘జాయింట్ జగదీశన్’ పేరడీ పోస్టర్లు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావటం మొదలైంది.
ఆ పోస్టర్లకు ప్రదీప్ లైక్ కొట్టారు. ఇదే ఆయన చేసిన తప్పు అయింది. ఆ పోస్టర్లతో పాటు ‘‘రజినీకాంత్ ఫ్యాన్స్ పిచ్చివాళ్లు’’ అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దీంతో రజినీ ఫ్యాన్స్ ప్రదీప్‌పై మండిపడుతున్నారు. రజినీని, రజినీ ఫ్యాన్స్‌ను కించపరిచే విధంగా ఉన్న పోస్టుకు లైక్ ఎలా కొడతావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మేరకు వరుస పోస్టులు పెడుతున్నారు.అయితే, ఈ వివాదంపై ప్రదీప్ ఇంకా స్పందించలేదు. మరి, ప్రదీప్, రజినీకాంత్ ఫ్యాన్స్‌కు సారీ చెబుతారా? లేదా? అన్నదానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ரஜினி இன்னைக்கும் Box-office assualt Industry hit கொடுக்க முடியும்ன்ற பயத்துலயே விஜய் பேன்ஸ் வாழ்றாங்க
ரஜினி பத்தின பேச்சு இருக்குற வரை அவரே ராஜா,இப்போவா நடக்குது 1980s இருந்து 😂🔥 https://t.co/Em3AA9Hoz0
— . (@Fine_tweete) February 2, 2023