లవ్‌టుడే సినిమాతో పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. మూడో సినిమా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. మంచి కామెడీ డ్రామా ఈ సినిమా ఉండబోతోందట.
తక్కువ సినిమాలు చేసి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న అతి కొద్ది మంది దర్శక నటుల్లో ప్రదీప్ రంగానాథన్ ఒకరు. ఈయన షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మెయిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడిగా మొదటి సినిమానే స్టార్ హీరోతో చేశారు. ప్రముఖ తమిళ నటుడు జయం రవితో ‘కోమాలి’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. రెండో సినిమాలో తనను తాను హీరోగా పెట్టుకుని, దర్శకత్వం వహించారు. ‘లవ్‌టుడే’ పేరుతో వచ్చిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి సక్సెస్‌ను అందుకుంది. తక్కువ సినిమాలతో ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్న ఈయన.. వివాదాల్లోనూ అంతే ఎక్కువగా నిలుస్తూ ఉన్నారు. తాను కావాలని ఆ వివాదాల్లోకి వెళ్లకపోయినా.. చిన్న పొరపాటును కూడా నెటిజన్లు తప్పుబడుతూ.. వివాదానికి తెరతీస్తున్నారు. తాజాగా, ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌పై ప్రదీప్ పెట్టిన ఓ పోస్టు రచ్చకు దారి తీసింది. ప్రదీప్.. వెట్రిమారన్ తీసిన ‘విడుదలై’ సినిమా చూశారు. ఆ వెంటనే తన ట్విటర్ ఖాతాలో ‘‘ విడుదలై సినిమా అద్భుతంగా ఉంది.
దర్శకుడు వెట్రిమారన్‌కు, టీంకు నా శుభాకాంక్షలు’’ అని రాసుకొచ్చాడు. ప్రదీప్ తన పోస్టులో వెట్రిమారన్ లాంటి సీనియర్, పెద్ద దర్శకుడిని ఏక వచనంతో సంభోదించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రదీప్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ‘‘ నీకంటే పెద్ద డైరెక్టర్‌ను సార్ అని పిలవు’’ ..‘‘వెట్రిమారన్‌కు మర్యాద ఇచ్చి మాట్లాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. విక్రమ్ సినిమాలోని సూర్య డైలాగ్ వీడియో, మీమ్స్‌ను పోస్టు చేస్తున్నారు.
కాగా, వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘విడుదలై’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించారు. సూరి సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారు. తమిళనాట ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మరి, వెట్రిమారన్‌ను సార్ అని సంభోదించకుండా ప్రదీప్ పోస్టు శుభాకాంక్షలు తెలియజేయటం తప్పని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Viduthalai is just Extraordinary .
My best wishes to Director Vetrimaran and team— Pradeep Ranganathan (@pradeeponelife) April 4, 2023