ప్రాజెక్ట్ కే ఈ ఘనత సాధించనున్న తొలి ఇండియన్ సినిమాగా నిలవనుంది. ఇది తమకు ఎంతో గర్వకారణమైన విషయమని, శాన్-డీగో వచ్చేస్తున్నామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.
‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా మారిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ Project K. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ ఇచ్చారు మూవీ టీం. ప్రాజెక్ట్ కే టైటిల్, టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్స్ ప్రతిష్టాత్మక శాన్ డీగో కామిక్ -కాన్ ఈవెంట్లో జరగనుందని తెలియజేశారు. జులై 20 నుండి 23 వరకు జరగబోయే ఈ ఈవెంట్‌లో.. మొదటి రోజున (జూలై 20) ప్రాజెక్ట్ కే ప్రోగ్రామ్ జరుగనుంది. ప్రభాస్, కమల్, దీపిక, నాగ్ అశ్విన్ కూడా పాల్గొనబోతున్నారు.
దీంతో ప్రాజెక్ట్ కే ఈ ఘనత సాధించనున్న తొలి ఇండియన్ సినిమాగా నిలవనుంది. ఇది తమకు ఎంతో గర్వకారణమైన విషయమని, శాన్-డీగో వచ్చేస్తున్నామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. శాన్ డీగో కామిక్-కాన్‌లో ప్రాజెక్ట్ కే లాంచ్ విషయాన్ని అమెరికాకు చెందిన వెరైటీ మ్యాగజైన్ వెల్లడించింది. ‘‘ఈ ఈవెంట్‌లో ప్రాజెక్ట్ కే టీమ్.. ‘దిస్ ఈజ్ ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ ఆఫ్ ఇండియాస్ మైథో సైంటిఫిక్ ఎపిక్’ అనే ప్యానల్‌ను హోస్ట్ చేస్తుంది. ఈ సందర్బంగానే మూవీ టైటిల్, టీజర్, రిలీజ్ డేట్స్‌ను అధికారంగా ప్రకటించనుంది’’ అని వెరైటీ మ్యాగ్‌జైన్ తమ రిపోర్టులో వెల్లడించింది.
భారతదేశ ప్రతిష్టాత్మక సినిమా యూనివర్స్‌లోకి ప్రత్యేకమైన ఈవెంట్‌కి వాళ్ల అతిథులను తీసుకురానున్నట్లు వైజయంతీ మూవీస్ తమ ప్రకటనలో తెలిపింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. హిందూ పురాణాలకు ఆధునికతను జోడించి తీస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ కే కనిపిస్తుంది. మరి త్వరలో రాబోయే ఈ మూవీ గురించి మీరు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
T 4697 – … a proud moment for me .. I never realised how important and BIG this is ..
Now I know .. my wishes to Vyjayanthi Movies , Nag Sir and the entire unit for the affection they have given me , and to make me a part of this incredible experience 🙏 https://t.co/7c5vbQ0i5I— Amitabh Bachchan (@SrBachchan) July 6, 2023