గ్లోబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ప్రెస్టీజియస్‌గా తెరెక్కుతున్న మూవీ Project K. బిగ్‌బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిలింను నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో, వైజయంతి మూవీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
‘ప్రాజెక్ట్ – K’ నుంచి బుధవారం (జూలై 19) మధ్యాహ్నం రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్‌లుక్ విడుదల చేయబోతున్నామంటూ మిల్లీ సెకన్లతో సహా టైం చెప్పి అంచనాలు పెంచేశారు. ఆ తర్వాత కాసేపటికి పోస్టర్ కాస్త ఆలస్యమవతుందని మరో ట్వీట్ వేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిలిం.. Project K నుండి ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది.
ప్రాజెక్ట్ కే ఈ ఘనత సాధించనున్న తొలి ఇండియన్ సినిమాగా నిలవనుంది. ఇది తమకు ఎంతో గర్వకారణమైన విషయమని, శాన్-డీగో వచ్చేస్తున్నామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.