గ్లోబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ప్రెస్టీజియస్‌గా తెరెక్కుతున్న మూవీ Project K. బిగ్‌బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిలింను నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో, వైజయంతి మూవీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
గ్లోబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ప్రెస్టీజియస్‌గా తెరెక్కుతున్న మూవీ Project K. బిగ్‌బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిలింను నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో, వైజయంతి మూవీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బుధవారం (జూలై 19) సడెన్‌గా డార్లింగ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇక నార్మల్ ఆడియన్స్, నెటిజన్ల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ‘ఇది అఫీషియల్ ఫస్ట్ లుక్కా? లేక, ఫ్యాన్ మేడా?’ అంటూ ఆశ్చర్యపోయారు. ఇక మీమ్స్ రాయుళ్లకు మాంచి స్టఫ్ దొరికింది. ట్రోల్స్, రకరకాల మీమ్స్‌తో చెలరేగిపోయారు. ‘ఫేస్ ప్రభాస్‌దే కానీ బాడీ ఎవరిది?’.. ‘ఐరన్ మెన్ బాడీకి ప్రభాస్ తల అతికించినట్లుంది’.. ‘అమీర్ పేట్ ఎడిటింగా?’ అంటూ విపరీతంగా ట్రోల్స్ చేశారు.
అసలే ‘ఆదిపురుష్’ దెబ్బతో షాక్‌లో ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ‘సలార్’ టీజర్‌లో ప్రభాస్ ఫేస్ సరిగా చూపించలేదంటూ నిరాశతో ఉన్నారు. ఇప్పుడు ‘ప్రాజెక్ట్-K’ ఫస్ట్‌లుక్ విషయంలో మరో సాలిడ్ షాక్ తగిలింది. ‘సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇలాంటి నాసిరకం పోస్టరా?.. దీనికంటే ఫ్యాన్ మేట్ పోస్టరే బాగుంది.. ఇదంతా చూస్తుంటే డార్లింగ్ కెరీర్‌పై కుట్ర జరుగుతున్నట్లనిపిస్తోంది’ అనే కామెంట్స్ కూడా వచ్చాయి.
దీంతో నిర్మాణ సంస్థ సందిగ్ధంలో పడింది. ఎట్టకేలకు తమ ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిమూవ్ చేసేసింది. తర్వాత నేమ్స్ లేకుండా ప్రభాస్ పోస్టర్ ఒకటి పోస్ట్ చేశారు. ట్రోలింగ్ వల్ల ఒక నిర్మాణ సంస్థ, హీరో ఫస్ట్‌లుక్ డిలీట్ చేయడం అనేది ఫస్ట్ టైం.. ఆల్ టైం రికార్డ్ అంటే ట్వీట్స్ వేస్తున్నారు. కాగా ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన పోస్టర్ మాత్రం అలాగే ఉంది.
ఇదిలా ఉంటే మూవీ టీమ్ నేడు (జూలై 20 – ఇండియన్ టైమ్ జూలై 21) శాన్ డియాగో కామిక్ కాన్ వేడుకల్లో భాగంగా ‘ప్రాజెక్ట్ – K’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకుగానూ అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ప్రభాస్ కొద్ది రోజులుగా అక్కడే ఉంటున్నాడు. రానా దగ్గుబాటి ఈవెంట్‌కి సంబంధించిన పనులు దగ్గరుండి చూసుకుంటున్నాడు. కమల్ హాసన్ కూడా చేరుకున్నారు. అమితాబ్, దీపిక కూడా జాయిన్ కాబోతున్నారని తెలుస్తుంది. ఫస్ట్‌లుక్‌తో వచ్చిన నెగిటివిటీ టైటిల్ గ్లింప్స్‌తో పోతుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.
After getting Trolled for First Look ,@VyjayanthiFilms Deleted Their FL Tweet on #ProjectK 🤣🤣🤣
This is first time ever ,one prod house deleted hero FL due to trolls 🔥💥
All Time Record pic.twitter.com/1lpMlkwEgt
— Hemanth Kiara (@ursHemanthRKO) July 20, 2023
20 hours to go 💥
The Hero rises. From now, the Game changes 🔥
This is Rebel Star #Prabhas from #ProjectK.
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/0EiA3RMlm5…@SrBachchan @ikamalhaasan… pic.twitter.com/G4McU7oAuS
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
The Raiders have started taking over @Comic_Con. Meet them and raid along into our universe. #ProjectK #SDCC2023 #WhatisProjectK pic.twitter.com/6puGN8aXoX
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023