రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిలిం.. Project K నుండి ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది.
టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా + గ్లోబల్ స్టార్ ప్రభాస్ సినిమా సినిమాకి తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాడు. ‘బాహుబలి’ సిరీస్ మూవీస్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసిన రాజమౌళి తనకిచ్చిన పాన్ వరల్డ్ క్రేజ్‌ని నిలబెట్టుకునేలా ఫిలింస్ లైనప్ చేస్తున్నాడు. ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ వంటి సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా వందల కోట్ల వసూళ్లు రాబట్టాయంటే అది ప్రభాస్ క్రేజ్ వల్లే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. KGF ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘సలార్’ రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఇక సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచీ అందరి దృష్టీ ‘ప్రాజెక్ట్ – K’ పైనే ఉంది. బిగ్‌బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, డార్లింగ్ ప్రభాస్, దీపిక పదుకొనే, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిలిం.. Project K.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ నెల 20న (ఇండియన్ టైమ్ జూలై 21) శాన్ డియాగో కామిక్ కాన్ వేడుకల్లో భాగంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల దీపిక ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కట్ చేస్తే, బుధవారం (జూలై 19) మధ్యాహ్నం రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్‌లుక్ విడుదల చేయబోతున్నామంటూ మిల్లీ సెకన్లతో సహా ప్రకటించి ఆశ్చర్య పరిచారు. 0 నుంచి 7 వరకు అంకెలను ఎంచుకున్న మేకర్స్.. 01.23.45.67 PM (IST – ఇండియన్ స్టాండర్డ్ టైం) ఆసక్తికరమైన నెంబర్ ఫ్రేమింగ్‌తో ఫస్ట్‌లుక్ టైం అనౌన్స్ చేశారు.
కట్ చేస్తే, చెప్పిన టైం కంటే కాస్త లేట్‌గా లుక్ రిలీజ్ చేశారు. తెలుగు ఆడియన్స్, మూవీ లవర్స్, వరల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న Project K నుంచి ప్రభాస్ లుక్ వచ్చేసింది. ప్రభాస్ ఐరన్ మ్యాన్‌లా కనిపిస్తున్నాడు. బ్యాగ్రౌండ్‌లో సూర్యుడిని చూపించారు. ప్రభాస్ హెయిర్ స్టైల్ చూస్తుంటే శివుడిని పోలినట్లు ఉందని కామెంట్ చేస్తున్నారు. డార్లింగ్ ఫస్ట్‌లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. టైటిల్ గ్లింప్స్ కోసం ప్రేక్షకాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.