‘ప్రాజెక్ట్ – K’ నుంచి బుధవారం (జూలై 19) మధ్యాహ్నం రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్‌లుక్ విడుదల చేయబోతున్నామంటూ మిల్లీ సెకన్లతో సహా టైం చెప్పి అంచనాలు పెంచేశారు. ఆ తర్వాత కాసేపటికి పోస్టర్ కాస్త ఆలస్యమవతుందని మరో ట్వీట్ వేశారు.
గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుసగా క్రేజీ సినిమాలు లైనప్ చేస్తున్నాడు. ప్రస్తుతం ‘సలార్’ సిరీస్ (రెండు భాగాలు), ‘ప్రాజెక్ట్ – K’, మారుతి సినిమా.. దాని తర్వాత సందీప్ రెడ్డి వంగాతో మూవీ. ఇప్పటికి ఇవి డార్లింగ్ చేతిలో ఉన్న చిత్రాలు. ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ వంటి సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా వందల కోట్ల వసూళ్లు రాబట్టాయి. కానీ సరైన సాలిడ్ సినిమా పడాలి అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచీ అందరి దృష్టీ ‘ప్రాజెక్ట్ – K’ పైనే ఉంది. బిగ్‌బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, డార్లింగ్ ప్రభాస్, దీపిక పదుకొనే, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిలిం.. Project K. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో, వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఈ నెల 20న (ఇండియన్ టైమ్ జూలై 21) శాన్ డియాగో కామిక్ కాన్ వేడుకల్లో భాగంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. బుధవారం (జూలై 19) మధ్యాహ్నం రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్‌లుక్ విడుదల చేయబోతున్నామంటూ మిల్లీ సెకన్లతో సహా టైం చెప్పి అంచనాలు పెంచేశారు. ఆ తర్వాత కాసేపటికి పోస్టర్ కాస్త ఆలస్యమవతుందని మరో ట్వీట్ వేశారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్.. లేట్ అయితే అయిందిలే ఔట్‌పుట్ అదిరిపోతుందిలే అనుకున్నారు. కట్ చేస్తే, వారి ఆశల మీద నీళ్లు కాదు కదా.. ఈ వాతావరణంలో చల్లటి ఐస్ క్యూబ్స్ కుమ్మరించారు మేకర్స్. ‘ఇది అఫీషియల్ ఫస్ట్ లుక్కా? లేక, ఫ్యాన్ మేడా?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ప్రభాస్ లుక్ మీద సోషల్ మీడియాలో ట్రోల్స్, ఫన్నీ మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ‘ఫేస్ ప్రభాస్‌దే కానీ బాడీ ఎవరిది?’.. ‘ఐరన్ మెన్ బాడీకి ప్రభాస్ తల అతికించినట్లుంది’.. ‘అమీర్ పేట్ ఎడిటింగా?’ అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలే ‘ఆదిపురుష్’ దెబ్బతో షాక్‌లో ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ‘సలార్’ టీజర్‌లో ప్రభాస్ ఫేస్ సరిగా చూపించలేదంటూ నిరాశతో ఉన్నారు. ఇప్పుడు ‘ప్రాజెక్ట్-K’ ఫస్ట్‌లుక్ విషయంలో మరో సాలిడ్ షాక్ తగిలింది. ‘సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇలాంటి నాసిరకం పోస్టరా?.. దీనికంటే ఫ్యాన్ మేట్ పోస్టరే బాగుంది.. ఇదంతా చూస్తుంటే డార్లింగ్ కెరీర్‌పై కుట్ర జరుగుతున్నట్లనిపిస్తోంది’ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ‘ఇది జస్ట్ లుక్ మాత్రమే.. సినిమాలో విషయముంటుంది. నాగ్ అశ్విన్ మీద నమ్మకముంది’ అనే పాజిటివ్ మాటలూ వినిపిస్తున్నాయి.
Idhi official ha🧐🧐🧐
— Sagar Nani (@SagarNaniJSPK) July 19, 2023
Yevadu ra just head Photoshop chesindhi..🤦😂 pic.twitter.com/mJeuuItoNK
— Rudra™ (@Mee_Rudra) July 19, 2023
Rey Asalu Em Chesthunnaru ra Maa Darling Ni 🥹🥹🥲🥲💔#Prabhas #WhatisProjectK #ProjectK #NagAshwin #DeepikaPadukone #PrabhasEra pic.twitter.com/jNitCMkRl5
— Addicted To Memes (@Addictedtomemez) July 19, 2023