ఇండస్ట్రీలో మంచి స్నేహాలకి కొదవ ఉండదు. కానీ.., హీరో, హీరోయిన్ మధ్య ఈ స్నేహం చిగురిస్తే రకరకాల వార్తలు పుట్టుకొస్తాయి. కానీ.., ప్రభాస్ అనుష్క మాత్రం ఇలాంటి కామెంట్స్ కి స్పందించకుండా చాలా ఏళ్లుగా సన్నహితులుగా ఉంటూ వస్తున్నారు. ఇక బాహుబలి తరువాత ప్రభాస్, అనుష్క ఒకరిని ఒకరు కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. కానీ.., ఇప్పుడు ఓ యంగ్ హీరో కోసం అనుష్క హెల్ప్ అడిగాడట రెబల్ స్టార్. ఆ వివరాల్లోకి వెళ్తే..
సంతోష్ శోభన్.. గోల్కొండ హై స్కూల్ సినిమాతో బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆపై తొందరగానే హీరోగా మారిపోయాడు. “తను నేను” సినిమాతో ఫస్ట్ అటెంప్ట్ చేశాడు. అది అంతగా ఆడకపోయినా.. ఆ తర్వాత “పేపర్ బాయ్” అనే చిత్రంలో నటించాడు. ఈమూవీ అతనికి పేరు తీసుకొచ్చింది కానీ.. చాన్సులు తీసుకురాలేదు. దీంతో నెక్స్ట్ మూవీ కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వచ్చిన ఏక్ మినీ కథ .. ఇప్పుడు సంతోష్ శోభన్ కెరీర్‌నే మార్చేసింది.
ఏక్ మినీ కథ మంచి పేరు తెచ్చుకోవడంతో.. సంతోష్ శోభన్ ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు.తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి డైరెక్షన్ లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో అగ్ర హీరోయిన్ అనుష్క గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే అంత ఈజీగా సంతోష్ శోభన్ మూవీలో నటించేందుకు అనుష్క ఎలా గ్రీన్ సగ్నల్ ఇచ్చిందా అన్న డౌట్ చాలా మందిని తొలుస్తోంది. అయితే దీని వెనుక పెద్ద రికమండేషనే ఉన్నట్టుగా తెలుస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ అనుష్కను సంతోష్ శోభన్‌మూవీలో నటించేందుకు ఒప్పించినట్లు చెబుతున్నారు. ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో వర్షం లాంటి మెగా హిట్ ను తనకి అందించాడు హీరో సంతోష్ శోభన్ తండ్రి దర్శకుడు శోభన్. అయితే ఆ కృతజ్ఞత భావం, వారి కుటుంబంతో ప్రభాస్ కి ఉన్న సాన్నిహిత్యంతో ఇప్పుడు సంతోష్ సినిమాకి హైప్ తెచ్చేందుకు అనుష్కను రంగంలోకి దింపాడట డార్లింగ్. తన ఫ్రెండ్ అడగడంతో కాదనలేక స్వీటీ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కాకపోతే ఈ సినిమాలో అనుష్క నిడివి చాలా తక్కువట. కాని ఈమె పాత్ర మాత్రం కథకు చాలా కీలకం అని అంటున్నారు. చూడాలి మరి ప్రభాస్ రికమండేషన్ ఈ యంగ్ హీరో కెరీర్‌కు ఎంత వరకు ప్లస్ అవుతుందో.