ప్రముఖ బాలీవుడ్ నటి పూనమ్ పాండే భర్త శామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేశారు. పూనమ్‌పై దాడి చేసినందుకు, ఆమెను తీవ్రంగా కొట్టినందుకు శామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూనమ్ ఫిర్యాదు మేరకు ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద శామ్ బాంబేపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన పూనమ్.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెండేళ్లు సహజీవనం చేసిన పూనమ్, సామ్ బాంబే.. ఏడాది క్రితం మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. ఐతే పెళ్లయ్యాక కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి పూనమ్‌పై దాడి చేసేవరకూ వెళ్లింది. దీంతో భర్తపై గృహహింస కేసు కూడా పెట్టింది పూనమ్. ఆ తర్వాత రాజీకొచ్చిన శామ్బాంబే పూనమ్‌కు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. వివాహ బంధంలో ఇలాంటివి సహజం అని కూడా తెలిపింది. ఎన్నోసార్లు కొట్టడం.. ఆపై క్షమించమని ప్రాధేయపడటం చేసేవాడని.. అప్పుడు కూడా అలాగే చేసాడని.. ఇకపై అలా జరగదు.. మంచిగా వ్యవహరిస్తానని వాగ్దానం చేశాడని దాంతో అతనితో మళ్లీ జీవితాన్ని ఆరంభించానని చెప్పింది.
ఈ మద్య శామ్బాంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడడంతో గొడవ జరిగింది. దీంతో శామ్బాంబే కోపం వచ్చింది. కోపంతో పూనమ్ పాండే జుట్టు పట్టుకుని తలను గోడకు కొట్టాడు. అంతేకాకుండా పూనమ్ ముఖంపై కొట్టాడు. ఈ దాడిలో పూనమ్ పాండే ఒక కన్ను, ఆమె ముఖంపై తీవ్ర గాయమైంది. పూనమ్ పాండే ఈ ఫిర్యాదు చేశాక బాంద్రా పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నారు.