ప్రముఖ బాలీవుడ్ నటి పూనమ్ పాండే భర్త శామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేశారు. పూనమ్‌పై దాడి చేసినందుకు, ఆమెను తీవ్రంగా కొట్టినందుకు శామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూనమ్ ఫిర్యాదు మేరకు ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద శామ్ బాంబేపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన పూనమ్.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండేళ్లు సహజీవనం చేసిన పూనమ్, సామ్ బాంబే.. ఏడాది క్రితం మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. […]