తెలుగులో పెద్దగా బజ్ లేకుండా రిలీజైన 'పొన్నియిన్ సెల్వన్ 2'.. డీసెంట్ వసూళ్లు సాధించింది. తొలిపార్ట్ తో పోలిస్తే.. తొలిరోజు కాస్త తక్కువనే వసూలు చేసిందని అంటున్నారు.
తెలుగు ప్రేక్షకులు నిజంగా ఖతర్నాక్స్! ఎందుకంటే సినిమా బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా దాన్ని ఆకాశానికెత్తేస్తారు. ఏ మాత్రం తేడా కొట్టినా చాలా దారుణంగా ట్రోల్ చేస్తారు. గతేడాది అలా ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్న పాన్ ఇండియా సినిమా ఏదైనా ఉందా అంటే చాలామంది చెప్పే మూవీ పేరు ‘పొన్నియిన్ సెల్వన్’. చోళుల జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ మూవీ.. తమిళ ఆడియెన్స్ కి తెగ నచ్చేసింది. మిగతావాళ్లకు పెద్దగా ఎక్కలేదు. ఈ క్రమంలోనే తాజాగా ‘PS-2’థియేటర్లలోకి వచ్చేసింది. దీనికి తొలిరోజు వచ్చిన కలెక్షన్స్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకీ ఏంటి సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పీరియాడికల్ సినిమాలు మనకు కొత్తేం కాదు. 1970-80ల నుంచి ఈ తరహా సినిమాల్ని తీస్తున్నారు. ఆ తర్వాత ఆపేశారు. కానీ ‘బాహుబలి’ మూవీ… ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఆ ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఇతర భాషల్లోని దర్శకులు ఆ తరహా ప్రయత్నాలు చేశారు. తమిళంలో మణిరత్నం.. ‘పొన్నియిన్ సెల్వన్’ బుక్ ని రెండు భాగాల సినిమాగా తీశారు. అందులో ఫస్ట్ పార్ట్ గతేడాది సెప్టెంబరు 30న, తాజాగా రెండో భాగం థియేటర్లలోకి వచ్చాయి. ఇప్పుడొచ్చిన మూవీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తోంది.
ఫస్ట్ పార్ట్ కి ఓవరాల్ గా రూ.500 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు సీక్వెల్ కూడా అంతలా కాకపోయినా తొలిరోజు బాగానే వసూళ్లు అందుకున్నట్లు తెలుస్తోంది. ‘పొన్నియిన్ సెల్వన్ 2’కి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.35-38 కోట్ల వరకు కలెక్షన్స్ దక్కినట్లు సమాచారం. తమిళనాడులో రూ.25 కోట్లు రాగా, ఆంధ్ర-తెలంగాణలో కలిపి రూ.3-4 కోట్లు, కర్ణాటకలో రూ.4-5 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా అన్నిచోట్లా కలిపి మంచి వసూళ్లే సాధించినట్లు తెలుస్తోంది. ఈ ఊపు చూస్తుంటే.. వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.100 కోట్ల మార్క్ అందుకోవడం పక్కా అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? మరి ‘PS-2’ మీలో ఎంతమంది చూశారు? మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.