ఈ మద్య చిన్న సినిమాల హవా నడుస్తుంది.. కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రాలైనా ప్రేక్షకులు ఆదరిస్తారని పలు చిత్రాలు నిరూపించాయి. ఈ క్రమంలో కన్నడ మూవీ ‘కాంతార’ ప్రస్తుతం అన్ని భాషల్లో రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో కన్నడ హీరో రిషబ్ షెట్టి స్వియ దర్శకత్వంలో నటించిన ‘కాంతారా’ 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో గిరిజన ప్రజల సంస్కృతికి చెందిన భూతకోల గురించి అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రంలోని భూతకోలకు సంబంధించిన సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేవిధంగా ఉంటాయి. ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురిపించారు.
ఈ చిత్రంలోని భూతకోల సంస్కృతిపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారని నటుడు చేతన్ కుమార్ పై శివకుమార్ అనే వ్యక్తి శేషాద్రినగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అయితే తాను భూతకోల సంస్కృతి హిందూ మతంలో భాగం కాదని మాత్రమే తన అభిప్రాయాన్ని వెల్లడించానని.. తన వ్యాఖ్యలు హిందూ మతాన్ని కించపరిచే విధంగా లేవని.. తాను ఏ మతాల మద్య విద్వేషాన్ని రెచ్చగొట్టలేదని నటుడు చేతన్ కుమార్ కోర్టులో వాధించాడు.
ఒక మత సంస్కృతిని కించ పరిచే విధంగా మాట్లాడటం.. మతాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల విషయంలో చేతన్ పై నమోదు చేసిన కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉండగా అడ్డుకోలేమని కర్ణాటక కోర్టు స్పష్టం తెలిపింది. మొత్తానికి చేతన్ కుమార్ పై పోలీసులు నమోదు చేసిన కేసు విషయంలో కర్ణాటక కోర్టు షాక్ ఇచ్చింది.