ఈమద్య ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని చంపాపేటలో ఓ జానపద నేపథ్య గాయకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన జటావత్ మోహన్.. బంజారా పాటలు పాడేవాడు. ఆయన గత కొంతకాంగా హైదరాబాద్‌లోని చంపాపేటలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మోహన్ మంగళవారం రాత్రి తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో ఎవరూ లేకపోయేసరికి ఉదయం వరకు ఎవరికీ ఆ విషయం తెలియలేదు.
ఇది చదవండి: అల్లుడ్ని హత్య చేసిన అత్తామామలు.. ఇంట్లోంచి వాసన రావటంతో..
బుధవారం ఉదయం స్థానికులు విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మోహన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టమ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మోహన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మోహన్ మరణంతో అతని స్వగ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల మోహన్ పాడిన పాటలు యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి.