సినీ ఇండస్ట్రీకి ఈ ఏడాది అస్సలు కలిసి రావడం లేదు. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో దిగ్గజ నటులు కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఆ తర్వాత డైరెక్టర్ మదన్ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ ప్రముఖ నటి తబస్సుమ్ గోవిల్ కన్నుమూశారు. ఇలా వరుస విషాదాలు మరువక ముందే.. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ సులోచన చవాన్ అనారోగ్యంతో ముంబాయిలోని తన నివాసంలో కన్నుమూశారు.
సులోచన చవాన్ 1993 మార్చి 13న ముంబాయిలో జన్మించింది. మొదట ఆమె ఇంటిపేరు సులోచన కదమ్.. ఆ తర్వాత సినీ దర్శకుడు ఎస్. చవాన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటి పేరు మార్చుకొని సులోచన చవాన్ గా పాపులర్ అయ్యింది. సులోచన చవాన్ తన 11వ ఏట నుంచే కెరీర్ ఆరంభించింది. రంగస్థలంపై ఆమె కృష్ణుడి పాత్రల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత గుజరాతీ చిత్రాల్లో నటించింది. మరాఠీ చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్, మాలీవుడ్ చిత్రాల్లో కూడా తన పాటలతో మెప్పించింది. సినీ ఇండస్ట్రీలో పాటలు పాడటమే కాకుండా.. ఎన్నో లైవ్ షోల ద్వారా తన పాటలతో అలరించింది.
సులోచన చవాన్ సాంస్కృతిక రంగంలో చేసిన కృషికి భారత ప్రభుత్వం ఆమెకు ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాదపడుతున్నారు. ఇటీవల ఆమెకు ఓ ప్రమాదంలో నడుము ఎముక విరిగింది.. ఆపరేషన్ కూడా చేయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ముంబయిలోని గిర్‌గావ్‌లోని ఫన్సవాడిలోని తన నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు తుదిశ్వాస విడిచారు. బాలు, లతా మంగేష్కర్ ల తర్వాత సంగీత ప్రపంచంలో మరో గొప్ప స్వరం కోల్పోయామని సులోచన చవాన్ కి సీనీ ప్రముఖులు, అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
लावणी सम्राज्ञी म्हणून परिचित असलेल्या ज्येष्ठ गायिका सुलोचना चव्हाण यांचं आज मुंबईत वार्धक्यानं निधन.@DDNewsHindi @DDNewslive pic.twitter.com/borCXongFY
— DD Sahyadri News | सह्याद्री बातम्या (@ddsahyadrinews) December 10, 2022