మసక మసక చీకటిలో మల్లె పూల వెనకాలా సాంగ్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఇప్పటి తరం కూడా ఆ పాట పాడుతుంది. ఆ పాట పాడిన అసలైన సింగర్ ఎల్. ఆర్. ఈశ్వరీ. అప్పట్లో ఆమె ఓ ప్రభంజనం. ఆమె పాడితే ఆ సాంగ్ ఫేమస్ కావాల్సిందే. ఎక్కువగా క్లబ్ సాంగ్స్ కు పాడేవారు. తాజాగా ఆమె ఓ ఇంటర్య్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘మాయాదారి చిన్నోడు మనస్సే లాగేసిండు, లేలే నా రాజా, మసక మసక చీకటిలో, మల్లె తోట ఎనకాలా, భలే భలే మగాడివో బంగారు నా సామివోయ్’ అంటూ తన హస్కీ వాయిస్‌తో మెస్మరైజ్ చేసిన లెజెండరీ సింగర్ ఎల్ ఆర్ ఈశ్వరి. 1960-70 దశకంలో ఆమె వాయిస్‌తో కుర్రకారును మత్తెక్కించారు. ఆమె పాడారంటే ఆ పాట హిట్ కావాల్సిందే. కోరస్ సింగర్‌గా మొదలైన ఆమె ప్రయాణం.. టాప్ సింగర్ రేంజ్‌కు చేరుకుంది. కైపు ఎక్కించే పాటలతో ఆమె పేరు గడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులు అనేక కష్ట నష్టాల వెల్లడించారు.
మత్తు ఎక్కించే పాటలే రావడం వెనుక ఆమె స్పందిస్తూ.. తాను హుషారుగా పాడతానని, దర్శకుడు తనకు ఆ పాటలే ఇచ్చారని ఆమె తెలిపారు.అందులో తన తఢాఖా చూపానని అన్నారు. జ్యోతి లక్ష్మి ఆట, నా పాట బాగా సెట్ అయ్యేవన్నారు. ఆ కాలమే వసంత కాలమని అన్నారు. ఇన్ని ఛానల్స్‌లో ఇంతకాలంగా పాటల కార్యక్రమాలు వస్తున్నాయి కానీ ఎందులోనూ తన పాటలు ఎవరూ పాడరని కారణం తెలియదన్నారు. ఆ సమయంలో యాంకర్ ఆమెతో ఊ అంటావా మామా సాంగ్ పాడించారు. ఈ పాటపై అభిప్రాయం అడగ్గా..ఇది ఒక పాటనా? పై నుంచి క్రింది వరకూ ఒకేలా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆరు లైన్లు ఒకేలా ఉన్నాయని అన్నారు.
” ఇప్పుడు ఏ పాటలు అంతగా నచ్చడం లేదు. మేము పాడిన పాటలు ఇప్పటికీ నిలబడటానికి కారణం మా వర్క్ అంత సిన్సియర్ గా ఉండేది. మ్యూజిక్ డైరెక్టర్ చూసుకోవాలి .. పిల్లలకేం తెలుసు .. చెప్పినట్టుగా పాడతారు. సినిమాలు కూడా అంతే ఉన్నాయి. అప్పట్లో ఒక్కో సినిమా 150 రోజులు నుండి 250 రోజులు ఆడేవి. ఇప్పుడు 10 రోజులు ఆడితే గొప్పగా చెబుతున్నారు” అంటూ నవ్వేశారు. అప్పట్లో మేం పాడిన సినిమాలు ఆడితే.. అవార్డులు ఇచ్చేవాళ్లని అన్నారు. ఎ.ఆర్ రెహమాన్ గురించి మాట్లాడుతూ.. చాలా బాగా కష్టపడ్డాడని అన్నారు. పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న ప్రశ్నకు.. తాను సంగీతాన్ని పెళ్లి చేసుకున్నానని తెలిపారు.
ఎల్.ఆర్ ఈశ్వరీ మద్రాసులో ఓ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. ఆమె అసలు పేరు లూర్డ్ మేరీ . ఈమె తండ్రి మద్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు. ఆమెకు ఐదేళ్ళ వయసులో అతడు మరణించాడు. దీంతో పోషణ భారం తల్లి నిర్మలపై పడింది. ఆమె మంచి గాయని కావడంతో సినిమాలలో అవకాశం లభించినప్పుడల్లా కోరస్ బృందాలకు పాడింది. ఆ సమయంలో తల్లితో పాటు ఈశ్వరీ కూడా రికార్డు స్టూడియోలకు వెళ్ళేవారు. ఆ సమయంలోనే ఆమె కూడా కోరస్ సింగర్ గా మారారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, తుళు, ఇంగ్లీష్ భాషల్లో వేల పాటల్ని పాడారు. ఈ ఇంటర్వ్యూలో పలు పాటలు పాడారు. ఆమెకు నచ్చిన పాటల్లో మీకు ఏదీ ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.