పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇక అటు రాజకీయాల్లోనూ తనదైన దూకుడుతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇటు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రంలో చేస్తున్నారు. పవన్ పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ లోకేషన్ లో ఖరీదైన బైక్ పై రైడ్ చేశారు. ఇక ఆ బైక్ ధర తెలిస్తే మనం షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ రైడ్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్.. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమా షూటింగ్స్ లోనూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. తాజా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు పవర్ స్టార్. ఇక పవన్ కు గన్స్, బైక్ లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఖరీదైన బైక్ పై హరిహర వీరమల్లు షూటింగ్ గ్యాప్ లో రైడ్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ బైక్ పై స్టైలిష్ లుక్ లో చిరునవ్వులు చిందిస్తు.. రైడ్ చేసుకుంటు వస్తోన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
అయితే రెండు సార్లు రైడ్ చేసిన పవన్ డిఫరెండ్ కాస్ట్యూమ్స్ లో కనిపించారు. హరిహర వీరమల్లు గెటప్ లో సైతం బైక్ రైడ్ చేసి అభిమానులను అబ్బురపరిచారు. ఇక ఈ బైక్ ధర తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. పవన్ నడిపిన ఈ బైక్ ప్రముఖ సంస్థ BMW కంపెనీ కు చెందినది. BMW R1250 GS మోడల్ కు చెందిన ఈ బైక్ ధర అక్షరాలా రూ. 24 లక్షలు. ప్రస్తుతం ఈ బైక్ పై పవన్ రైడ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. కొన్నిరోజులు రాజకీయ కార్యక్రమాలకు గ్యాప్ ఇచ్చి సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం.