పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉన్న జనసేనాని ఇప్పుడు ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్.. ఇది కేవలం పేరు మాత్రమే కాదు. పవర్. ఆయన పిలుపు ప్రభంజనం. హీరోగా ప్రేక్షకాభిమానులనే అలరించడమే కాకుండా రాజకీయ నాయకుడిగా అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు. షూటింగ్స్ నుండి కాస్త బ్రేక్ తీసుకుని ఇటీవల వారాహి యాత్ర ప్రారంభించిన జనసేనానికి అక్కడి జనాలతో పాటు ఇతర హీరోల అభిమానుల నుండి కూడా భారీ మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల గురించి పవన్ మాట్లాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుంటూనే తన మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన ‘బ్రో’ మూవీ టీజర్ కోసం డబ్బింగ్ చెప్పారాయన. టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే పవర్ స్టార్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉన్న జనసేనాని ఇప్పుడు ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ప్రొఫైల్‌లో ఇతర అకౌంట్ల మాదిరిగానే ‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..Jai Hind!’ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ ఆర్టికల్ రాసే సమయానికి 366K ఫాలోవర్స్ ఉన్నారు. ఎలాంటి పోస్టులైతే చేయలేదు కానీ జూన్ నెలలో జాయిన్ అయినట్లు జూలైలో అకౌంట్ వెరిఫై అయినట్లు, అలాగే గత 90 రోజుల్లో యూజర్ నేమ్ ఒక్కసారి మార్చినట్లు చూపిస్తుంది.
పవన్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంటర్ అయ్యారని తెలియగానే ఫ్యాన్స్, ఇండస్ట్రీ వారు, పొలిటికల్ పర్సన్స్ అందరూ ఫాలో చేస్తున్నారు. ఇతర హీరోలు సామాజిక మాధ్యమాలలో ఫాలోవర్ల పరంగా రికార్డ్ సెట్ చేశారు. అయితే సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ప్రభంజనం సృష్టిస్తున్న పవన్ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘బ్రో’ ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ వారంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు.