తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య పలువురు సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా తో ఆసుపత్రిలో చికిత్స కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. శివశంకర్ మాస్టర్ సతీమణి, పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.
అయితే శివ శంకర్ మాస్టర్ మరణవార్త విని తెలుగు ప్రముఖ నటులు స్పందించారు. కాగా మెగాస్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్ మృతి పట్ల ట్విట్టర్ లో స్పందిస్తూ తీవ్ర భావేద్వేగానికి లోనయ్యారు. అతనితో ఉన్న అనుభందాన్ని తెలిపారు. అయితే సోమవారం శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియల్లో కొందరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక వీళ్లతో పాటు డైరెక్టర్ ఓంకార్ శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అయితే గతంలో ఓంకార్, శివ శంకర్ మాస్టార్లు కలిసి బుల్లితెరపై అనేక డ్యాన్స్ షోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. దీంతో శివ శంకర్ మాస్టర్ మరణ వార్త విన్న ఓంకార్ హుటాహుటిన ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక దీంతో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న ఓంకార్ స్వయంగా శివ శంకర్ మాస్టార్ పాడే మోసి అతని పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.