సెలబ్రిటీలు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు సాధారణ ప్రజలకంటే ఎక్కువుగా కార్లు, బైకులను కొనుగోలు చేస్తూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సెలబ్రిటీలు కొనుగోలు చేస్తే మాత్రం .. అది వార్తల్లో నిలుస్తుంది. కారణం సెలబ్రిటీలపై జనాల్లో ఉన్న ఆసక్తి అటువంటిది. అంతేకాక సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో హీరోహీరోయిన్లు, డైరెక్టర్స్.. ఇతర నటులు లగ్జరీ కార్స్ కొనడం చూస్తూనే ఉన్నాము. వాటికి సంబంధించిన పిక్స్, వీడియోలను సెలబ్రిటీలు షేర్ చేయగా నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా మరో యంగ్ హీరో ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. యాంకర్, దర్శకుడు ఓంకార్ తమ్ముడు యంగ్ హీరో అశ్విన్ బాబు కొత్త కారును కొన్నాడు. ప్రస్తుతం తన కొత్త కారుతో అశ్విన్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఓంకార్.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అనేక షోల్లో తనదైన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. వన్ సెకండ్ అంటూ ఓంకార్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాక పలు సినిమాలకు సైతం దర్శకత్వం వహించాడు. ఇక ఆయన తమ్ముడు.. అశ్విన్ బాబు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఓంకార్ దర్శకత్వం వహించిన ‘రాజుగారి గది’ సినిమాతో టాలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం రాజుగారి గది సిరీస్ లో వచ్చిన మూడు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆ సినిమాలతో పాటు..”జత కలిసే”, ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ చిత్రాలతోనూ నటించి అందరిని ఆకట్టుకున్నాడు.
ఇక ప్రస్తుతం ‘హిడింబ’ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా ఓ సూపర్ డూపర్ హిట్ కొట్టాలనే కసితో అశ్విన్ ఉన్నాడు. ఈ సినిమాకు అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించగా.. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్ లో గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. ఈ సినిమాలో అశ్విన్ సరసన నందితా శ్వేతా హీరోయిన్ గా నటించింది. ఇక అశ్విన్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఇటీవలే ఆయన ఓ కొత్త కారు కొన్నట్లు సమాచారం. లగ్జీరియస్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును సొంతం చేసుకున్నాడు. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ లగ్జరీ కార్ ఆన్ రోడ్ ప్రైస్ రూ. 80 లక్షలపైనే ఉంటుందంట.
ఈ సందర్భంగా అన్నయ్య ఓంకార్ చేతుల మీదుగా అశ్విన్ బొకే అందుకున్నాడు. అంతేకాక అన్నతో కలిసి ఫస్ట్ రైడ్ కి వెళ్లాడు. ఓంకార్ నడుపుతుండగా అశ్విన్ పక్కన కూర్చున్నాడు. ఈ మధరుమైన గుర్తులను అశ్విన్..తన అభిమాలనుతో పాటు నెటిజన్లుతో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అశ్విన్ బాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరీ.. అశ్విన్ ఖరీదైన కారు కొనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.