యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. తమ అభిమాన హీరో RRR మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. క్రేజీ దర్శకులతో తర్వాతి సినిమాలు కమిట్ అయ్యాడు. షూటింగ్ కూడా త్వరలో ప్రారంభమైపోతాయ్.. అంతా బానే ఉంది కానీ డైరెక్టర్ బుచ్చిబాబుతో చేయబోయే మూవీ స్టోరీ ఇదేనని సోషల్ మీడియాలో టాక్ రావడంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఈ రిస్క్ అవసరమా అని మాట్లాడుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. RRR మూవీతో ఎన్టీఆర్ స్టామినా ప్రపంచవ్యాప్తమైంది. హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్స్, నటులు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ తారక్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వచ్చారు.
ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ కావడంతో ఎన్టీఆర్.. తర్వాత చేయబోయే సినిమాలపై బజ్ పెరిగింది. దానికి తగ్గట్లే కొరటాల శివ, ప్రశాంత్ నీల్.. తారక్ కోసం అదిరిపోయే స్టోరీలు సిద్ధం చేశారు. మరోవైపు ‘ఉప్పెన’తో డైరెక్టర్ గా మారిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు.. ఎన్టీఆర్ తోనే రెండో సినిమా చేస్తానని ఫిక్సయ్యాడు. అందుకే ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించలేదు. కానీ ఈ సినిమా స్టోరీ ఇదేనని సోషల్ మీడియాలో ఓ టాక్ వైరలైంది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తారని, యంగ్ పాత్ర కబడ్డీ ప్లేయర్ కాగా.. వీల్ ఛైర్ కే పరిమితమైన 60 ఏళ్ల వృద్ధుడి పాత్ర మరొకటి ఉందని టాక్.
ఇది ఫ్యాన్స్ చెవిలో పడేసరికి.. వారంతా షాకవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ గా రేంజ్ పెంచుకునే క్రమంలో ఈ రిస్క్ అవసరమా అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ‘ఆంధ్రావాలా’ సినిమాలో ఇలానే ఎన్టీఆర్… యంగ్-ఓల్డ్ క్యారెక్టర్స్ చేశారు. బట్ ఆ మూవీ డిజాస్టర్ అయింది. మళ్లీ అలాంటి రిజల్ట్ రిపీటవుతుందేమోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు. మరి ఎన్టీఆర్-బుచ్చిబాబు స్టోరీ గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: ఆస్కార్ బరిలో NTR.. ఆ వార్తలు ఎంత వరకు నిజం ?