తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో, హీరోయిన్ లు అటు సినిమాలు ఇటు బుల్లితెర షోలు చేస్తూ తెగ బిజీగా గడుపుతున్నారు. నాగార్జున బిగ్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా యంగ్ టైగర్ యన్టీఆర్, తమన్నా వంటి నటులు బుల్లితెర షోలకు హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇక యన్టీఆర్ విషయానికొస్తే.. గతంలో బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించి తన టాకింగ్ పవర్ తో బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.
అయితే ప్రస్తుతం యన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతూ బుల్లితెర ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. మంచి రేటింగ్ తో ముందుకెళ్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు షోని యన్టీఆర్ వదులుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలకు ఓకే చేయటంతో బిజీ షెడ్యూల్డ్ కారణంగా ఈ షోకి హోస్ట్ గా చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సీజన్ కి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న తారక్ ఇక మీదట వచ్చే షోకి చేయబోనని షో నిర్వాహకులకు చెప్పినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే యన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు హోస్ట్ గా చేయటానికి నిరాకరించాడా లేక బిజీ షెడ్యూల్డ్ కారణంగా వద్దనుకున్నాడా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో యాన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు షోపై తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.