ఎన్టీఆర్ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఎట్టకేలకు తెలిసిపోయింది. అందరూ అనుకున్నట్లు ఆ బాలీవుడ్ బ్యూటీనే హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. మరి ఆమె ఎవరో తెలుసా?
హమ్మయ్యా.. చాలారోజుల తర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్, కొరటాల శివతో సినిమా చేస్తాడని ఎప్పుడో ప్రకటన ఇచ్చారు. అయితే ఆ ప్రాజెక్టు స్టార్ట్ ఎప్పుడు? రిలీజ్ ఎప్పుడు? లాంటి విషయాలు మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఆ మధ్య ఫ్యాన్స్ కాస్త ఎక్కువ హడావుడి చేశారు. దీంతో ఎన్టీఆర్ స్వయంగా ఫ్యాన్స్ కు స్మూత్ వార్నింగ్ ఇచ్చాడు. గత నెలలో లాంఛనంగా పూజా కార్యక్రమం జరగాల్సింది. కానీ తారకరత్న మరణంతో అది కాస్త వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా NTR30 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తారక్ తన తర్వాతి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే కొరటాలతో చేయాల్సిన సినిమా కోసం చాలా టైం తీసుకున్నాడు. అయితే ఫిబ్రవరిలో పూజా కార్యక్రమం జరగాల్సి ఉంది కానీ అది వాయిదా పడింది. ఇప్పుడు సినిమా నుంచి హీరోయిన్ ఎవరనేది రివీల్ చేశారు. గత కొన్నాళ్ల నుంచి చెప్పుకొన్నట్లే హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారు. అందుకు సంబంధించిన ఓ పోస్టర్ ని తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.
ఇందులో భాగంగా లంగాఓణీలో, జాన్వీ కపూర్ బ్యాక్ సైడ్ తో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. వెనక వైపు భయంగొల్పే రీతిలో బీచ్ ఎగసిపడుతున్నట్లు ఉంది. దీన్నిబట్టి చూస్తుంటే.. NTR30లో ఈమెది కాస్త ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తోంది. అలానే జాన్వీకి ఇది తొలి తెలుగు సినిమా కూడా. అలానే వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకున్నారు. కొరటాల-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ రెండో చిత్రంపై బాక్సాఫీస్ దగ్గరయితే భారీ అంచనాలున్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే.. జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
She’s the calm in the storm from the fierce world of #NTR30 ❤️
Happy Birthday and welcome onboard #JanhviKapoor 💫@tarak9999 #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts pic.twitter.com/g1sKFxuIir
— NTR Arts (@NTRArtsOfficial) March 6, 2023