సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల విషయాల పట్ల ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక వారిపై వచ్చే రూమర్స్, గాసిప్స్ పై రకరకాలుగా చర్చించుకుంటారు. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోయిన్ ఫొటో నెట్టింట్లో చెక్కర్లు కొడుతుండగా నెటిజన్లు పలు కామెంట్లతో స్పందిస్తున్నారు.
టాలీవుడ్ లో చాలామంది తారలు వస్తుంటారు వెళ్తుంటారు. కొద్దిమంది హీరోయిన్స్ తమ ఆక్టింగ్, గ్లామర్ తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేస్తారు. మరి కొంతమంది హీరోయిన్లు చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటారు. సినిమాల్లో అవకాశాలు వెల్లువలా రావాలంటే హీరోయిన్లు వారు పెట్టుకున్న హద్దులు చెరిపేసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే సినీ పరిశ్రమలో ఎక్కువ కాలం నిలదొక్కుకోగలుగుతారు. లేదంటే అవకాశాలు తగ్గి నటనకు దూరమవ్వాల్సి ఉంటుంది. ఇలాగే ఓ స్టార్ తెలుగు హీరోయిన్ కొంత కాలంగా సినిమాలకు దూరమైంది. కాగ తనకు సంబంధించిన చిన్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా?
బుల్లితెరపై యాంకర్ గా రాణించి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఆ ముద్దుగుమ్మ. ఇటీవల విడాకుల టాపిక్ తో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? ఆమె మరెవరో కాదు.. కలర్స్ ప్రోగ్రంలో యాంకర్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి రెడ్డి. ఈమె కలర్స్ స్వాతిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ప్రముఖ హీరోలను ఇంటర్య్వూ చేసి క్రేజీ యాంకర్ గా పేరు పొందింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటించి మెప్పించ్చింది.
తెలుగులో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో ప్రసునాంభగా చేసిన రోల్ కి కలర్స్ స్వాతికి మంచి పేరు వచ్చింది. అష్టాచమ్మా సినిమాతో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తరువాత గోల్కొండ హైస్కూల్, త్రిపుర, స్వామి రారా, కార్తికేయ వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత వికాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిలైంది. ఇటీవల కలర్స్ స్వాతి భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు మీడియాలో చెక్కెర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కలర్స్ స్వాతి చిన్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.