సినిమా కష్టాలు అనే పదం చాలా మంది వాడుతూ ఉంటారు. కానీ, సినిమా వాళ్లకు కూడా సినిమా కష్టాలు వస్తూ ఉంటాయి. కెరీర్ ప్రారంభంలో వారు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది.
ఆడవాళ్లు సినిమా ఇండస్ట్రీలో రానించటం అంత ఈజీ కాదు. వారు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవటం ఒక ఎత్తయితే.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పడే కష్టాలు ఇంకో ఎత్తు. ఫస్ట్ సినిమాతో దశ తిరిగితే పర్లేదు. అలా కాకుంటే.. వచ్చీ రాని అవకాశాలతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పూట గడవని పరిస్థితుల్లో సినిమాలతో పాటు వేరే పనులు చేసుకున్న నటీమణులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహి కూడా ఒకరు. ఈమె తన కెరీర్ ప్రారంభంలో తీవ్రమైన డబ్బు కష్టాలను ఎదుర్కొన్నారు. డబ్బు కోసం చిన్న చిన్న పనులు ఎన్నో చేశారు. ఈ కష్టాలపై ఆమె తాజాగా, మీడియాతో మాట్లాడుతూ..
‘‘ నేను ఇప్పుడు సాధించిన అవకాశాలు మొత్తం చాలా చివరగా దక్కినవే.. నేను వీటన్నింటికీ సిద్ధమై ఉండి ఉన్నాను. అప్పట్లో నేను అందరు అమ్మాయిల్లా పార్టీలకు వెళ్లేదాన్ని కాదు. అసలు నాకు బాయ్‌ఫ్రెండ్ కూడా లేడు. నేను నా గదిలో తలుపులు బిగించుకుని ఉండేదాన్ని. హిందీ భాషను నేర్చుకునే దాన్ని. టీవీలో షోలు చూస్తూ భాషను ప్రాక్టీస్ చేసేదాన్ని. నేను నా సోదరుడి పెళ్లికి కూడా వెళ్లలేకపోయాను. చాలా మంది నన్ను ‘‘నువ్వు ఏమన్నా మరో కత్రినా కైఫ్ అవుదామని అనుకుంటున్నావా?’’ అని వ్యంగ్యంగా ప్రశ్నించేవారు.
నేను నా ఖర్చులకు డబ్బులు సరిపోక హుక్కా సెంటర్లో కూడా పని చేశాను. ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అందరి దగ్గరకు వెళ్లి హుక్కా బాటిళ్లు అందించాల్సి వచ్చేది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నోరా ఫతేహి ‘రోయర్’ అనే హిందీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. టెంపర్ సినిమాతో ఐటం గాళ్‌గా మారారు. బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసి ప్రేక్షకులకు ఉర్రూతలూగించారు. మరి, నోరా ఫతేహి సినిమా కష్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.