నాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ యోరుబా హాస్యనటుడు “డెజో తున్ఫులు“గా అలియాస్ కున్లే అడెటోకున్బో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 49 ఏళ్లకే డెజో తున్ఫులు ఆకస్మికంగా మరణించేసరికి అక్కడి సినీ వర్గాలలో విషాదఛాయలు పులుముకున్నాయి. నాలీవుడ్ ఇండస్ట్రీలో అడెటోకున్బో హాస్యనటుడుగా, రచయితగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు.
1972 మే 31న లాగోస్ రాష్ట్రంలోని లాగోస్ ఐలాండ్ లోని ఇడుమోటాలో డెజో తున్ఫులు జన్మించారు. 2016లో హాలీ ది డ్రమ్మర్, 2020లో జైడ్ జెన్డో సినిమాల ద్వారా పాపులారిటీ దక్కించుకున్నాడు. “ఓమో ఒరాన్” అనే సినిమాతో హాస్యనటుడుగా గుర్తింపు పొందాడు. డెజో తున్ఫులు మరణవార్త విని షాక్కు గురైన నైజీరియన్ థియేటర్ ఆర్ట్స్ మరియు మోషన్ పిక్చర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ (TAMPAN) జాతీయ అధ్యక్షుడు బోలాజీ అముసన్, శుక్రవారం న్యూస్ ఏజెన్సీ ఆఫ్ నైజీరియా(NAN)కి ధృవీకరించారు.మూడు రోజుల ముందే అడెటోకున్బోని ఓ పార్టీలో కలిశాను. ఇంతలోనే ఈ విచార వార్త రావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. శుక్రవారం ఇతర నాలీవుడ్ నటులు కూడా డెజో తున్ఫులు అకాల మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రముఖులు వేర్వేరు ఇండస్ట్రీ ఓ గొప్ప కమెడియన్ ని కోల్పోయిందని చెప్పారు.