మనకు తెలుగులో అమ్మ అనగానే అన్నపూర్ణమ్మ ఎలా గుర్తుకువస్తుందే.. బామ్మ పాత్రలకు పెట్టింది పేరు నిర్మలమ్మ. అగ్ర హీరోలకు బామ్మగా.. తన సహజ నటనతో కట్టిపడేసింది. ఆమె సుమారు వెయ్యికి పైగా సినిమాలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఈ రికార్డును బహుశా ఎవరూ చేరి ఉండరు. ఆమె మనవడు కూడా
తెలుగులో సినిమా పరిశ్రమలో ఇప్పుడు హారోయిన్లకు కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం లేదు. గతంలో అయితే ప్రతి ఒక్కరికి బలమైన క్యారెక్టర్ ఉండేది. ఇచ్చిన పాత్రను వందకు వంద శాతం రక్తికట్టించేవారు. ముఖ్యపాత్రలతో పాటు కామెడీ కోసం ఓ జంటను పెట్టేవారు. వారితో డ్యూయెట్ చేయించేవారు. లేదంలో కథలో వారి పాత్ర నిడివి ఎక్కవ ఉండటమో, ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ ఇవ్వడమో ఉంటుంది. అలా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మనకు తెలుగులో అమ్మ అనగానే అన్నపూర్ణమ్మ ఎలా గుర్తుకువస్తుందే.. బామ్మ పాత్రలకు పెట్టింది పేరు నిర్మలమ్మ. అగ్ర హీరోలకు బామ్మగా.. తన సహజ నటనతో కట్టిపడేసింది.
ఆమె సుమారు వెయ్యికి పైగా సినిమాలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఈ రికార్డును బహుశా ఎవరూ చేరి ఉండరు. రాజేంద్రప్రసాద్, నిర్మలమ్మ కాంబో బాగా హిట్. అలాగే చిరంజీవి, మోహన్ బాబుతో కూడా ఆమె ట్రాక్ చాలా ఫన్నీగా ఉంటుంది. 1920 మచిలీ పట్నంలో పుట్టిన నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. ఆమెకు చిన్నప్పటి నుండే నాటకాలంటే తెగ ఇష్టం. నాటకాలు వేస్తుంటడగా.. సినిమా అవకాశాలు వచ్చాయి. తొలుత ఓ సినిమాలో చెలికత్తె పాత్ర పోషించిన నిర్మలమ్మ. కృష్ణప్రేమ అనే చిత్రంలో నిర్మలమ్మ రుక్మిణి పాత్ర లభించింది. అక్కడి నుండి ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ శోభన్ బాబుకు వంటి ఆనాటి అగ్ర హీరోలకు అమ్మగా నటించిన ఆమె.. ఆ తర్వాత బామ్మగా మారింది. అయితే ఈమె రియల్ లైఫ్లో ఈ బామ్మకు ఓ మనవడు ఉన్నాడు. అతడు కూడా సినిమాల్లో నటించాడు.
నిర్మలమ్మ వ్యక్తిగత జీవితానికి వస్తే.. కృష్ణారావు అనే వ్యక్తిని మనువాడింది. వీరిద్దరికీ పిల్లలు లేరు. దీంతో ఆమె ఒక కుమార్తెను దత్తత తీసుకుంది. ఆమె పేరు కవిత. ఆమెను చదివించి ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేసింది. వీరూ అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి పుట్టిన కుమారుడు విజయ్ మాదాల. అతడు ఓ సినిమాలో కనిపించారు. ఇంతకు ఆ సినిమా ఏమనుకుంటున్నారా.. సినీ బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన పడమటి సంధ్యారాగంలో నటించారు. అందులో గణపతి పాత్రలో.. తిండిపోతు క్యారెక్టర్లో నటించింది అతడే. తండ్రి అతడికి తిండి పెట్టలేక నానా అవస్థలు పడుతుంటారు. ఈ సినిమాలో అతడిదీ కామెడీతో పాటు కీ రోల్. ఆ సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించని ఆయన.. శోభా అనే మహిళను వివాహం చేసుకున్నారు.