సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల గురించి ఎలాంటి కొత్త కబురు వినిపించినా ఫ్యాన్స్ హ్యాపీ అవుతుంటారు. అందులోను లవ్ – అఫైర్స్ -పెళ్లి గురించి వినిపిస్తే ఓ రేంజిలో ఇంటరెస్ట్ పెడతారు. తాజాగా కుర్రభామ నిధి అగర్వాల్ పెళ్లి వార్తల్లో నిలిచి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అవును.. నిధి అగర్వాల్ త్వరలో ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుందట. అదికూడా తనతో సినిమా చేసిన హీరోతోనే లవ్ లో పడి ఇప్పుడు పెళ్లి వైపు అడుగులేస్తోందని టాక్.
ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. తమిళ ఇండస్ట్రీలో మన్మథుడిగా పేరు తెచ్చుకున్న శింబుతో నిధి సీక్రెట్ ప్రేమాయణం కొనసాగిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు తెలుగులో సినిమాలు చేసింది కానీ ఏ సినిమా కూడా నిధికి మంచి హిట్, గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ఇక ఎప్పుడైతే అమ్మడు తమిళంలో సినిమాలు చేయడం మొదలు పెట్టిందో వరుసగా హిట్స్ అందుకుంటోంది. తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు చేసిన నిధి.. తమిళంలో భూమి, ఈశ్వరన్ సినిమాలతో హిట్స్ ఖాతాలో వేసుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఇటు తెలుగు, అటు తమిళ అవకాశాలు బాగానే ఉన్నాయట.ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నిధి హీరో శింబుతో డేటింగ్ లో ఉందని ఇండస్ట్రీ టాక్. నిజానికి శింబుకి ఇండస్ట్రీలో ఉన్న ఎఫైర్స్, బ్రేకప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ఆ లిస్టులోకి నిధి చేరిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఈ ఇద్దరూ కలిసి గతేడాది ఈశ్వరన్ సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయం పై ఈ ఇద్దరే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి శింబుతో నిధి ప్రేమలో ఉందనే విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.