పండగ అంటే ఎవరికి వారు ఇంట్లో కూర్చుని చేసుకునేది కాదు, అందరితో కలిసి చేసుకునేది. ఎలాంటి తేడాలు లేకుండా అందరూ అందరితో కలిసిపోయి చేసుకునేదే పండగ. అలాంటి పండుగ నాడు చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూసేందుకు వెళ్లారు. దసరా సినిమా ఒక పక్క పాన్ ఇండియా స్థాయిలో కుమ్మేస్తుంటే.. మరో పక్క మిగతా భాష చిత్రాలు కూడా పండగ సీజన్ లో మంచి టాక్ ను సంపాదించుకున్నాయి. అయితే ఒక నిరుపేద మహిళ తన కుటుంబంతో కలిసి సినిమా చూడ్డానికి వస్తే థియేటర్ నిర్వాహకులు అనుమతించలేదు. ఆమె దగ్గర టికెట్ ఉన్నా కూడా రానివ్వలేదు.
సినిమా అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ఇక అభిమాన హీరో సినిమా వస్తుందంటే చాలు విడుదలైన మొదటి రోజే థియేటర్ కి వెళ్లి చూస్తారు. సినిమాలను పోషించేది ఎక్కువగా పేద వారు, మధ్యతరగతి ప్రజలే. 365 రోజులూ ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడి పని చేసే వారందరికీ మెడిసన్ సినిమా. సినిమా చూస్తే తమ కష్టాలను మర్చిపోతారు. అలాంటి సినిమా చూసేందుకు ఎవరైనా రావచ్చు. పలానా వాళ్ళే రావాలి, పలానా వాళ్ళు రాకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడా నియమం ఉండదు. ఉన్నా ఉండనివ్వరు. ఇప్పటివరకూ అలాంటి నియంత నియమం లేదు కూడా. అయితే సినిమా చూద్దామని వెళ్లిన నిరుపేదలకు థియేటర్ లో అనుమతి ఇవ్వలేదు.
శింబు నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ పాతు తల సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే చెన్నైలోనే కోయంబత్తూర్ లో ఉన్న రోహిణి థియేటర్ కు సినిమా చూద్దామని నరికురువర్ సామాజిక వర్గానికి చెందినవారు కొంతమంది వచ్చారు. అయితే వారిని సదరు థియేటర్ నిర్వాహకులు వారిని సినిమా చూసేందుకు అనుమతించలేదు. మీలాంటి వారికి అనుమతి లేదు అంటూ సైగలు చేస్తూ వారిని థియేటర్ లోపలకు అనుమతించకుండా అడ్డుకున్నారు. వారు తమ కష్టార్జీతంతో టికెట్ కొనుక్కున్నారు. ఈరోజు శ్రీరామనవమి పండగ అని కుటుంబంతో కలిసి ఆమె సినిమా చూసేందుకు వచ్చారు. కానీ థియేటర్ నిర్వాహకులు పండగ పూట వారిని బాధపెట్టారు. తక్కువ సామాజిక వర్గం అన్న కారణంగా అనుమతించలేదు అంటూ వార్తలు వస్తున్నాయి.
காசு கொடுத்து டிக்கெட் வாங்கினப்புறம் என்னடா இது @RohiniSilverScr pic.twitter.com/bWcxyn8Yg5
— Sonia Arunkumar (@rajakumaari) March 30, 2023
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థియేటర్ నిర్వాహకులపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఎక్కువ, తక్కువలు అనేవి సామాజిక వర్గంలో ఉండవని.. మనిషి యొక్క గుణంలో మాత్రమే ఉంటాయని.. టికెట్లు ఉన్నా వారిని ఎందుకు అనుమతించలేదని మండిపడుతున్నారు. థియేటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై సంగీత దర్శకుడు జీ.వీ. ప్రకాష్ కుమార్ స్పందించారు. సోదరులు, సోదరీమణులు థియేటర్ కు ఆలస్యంగా వచ్చారని.. అయినా గానీ థియేటర్ నిర్వాహకులు అనుమతించకపోవడం అనేది ఏ విధంగానూ సమర్థనీయం కాదని, కళ అనేది ప్రతీ ఒక్కరికీ చెందుతుందని ట్వీట్ చేశారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
அந்த சகோதரியும் சகோதரர்களும் பின் தாமதமாக அனுமதிக்கப்பட்டதாக விவரம் தெரிகிறது , எனினும் முதலில் அனுமதிக்க மறுத்தததை எவ்விதத்திலும் ஏற்றுக்கொள்ள இயலாது. கலைகள் அனைவருக்கும் சொந்தமானது. https://t.co/IjGBzxLkJT
— G.V.Prakash Kumar (@gvprakash) March 30, 2023