ఈ మధ్యకాలంలో హిట్టయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది మామూలే అయిపోయింది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో త్వరలోనే మరో బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ రాబోతుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో శింబు హీరోగా తెరకెక్కిన సినిమా ‘మానాడు’. గతేడాది తమిళనాడులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు వసూల్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా టైమ్ లూప్ జానర్ లో ఈ సినిమాను అద్భుతంగా రూపొందించాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఈ సినిమాను తెలుగులోకి ‘ది లూప్’ పేరుతో డబ్ చేశారు.
ఇక ఈ సినిమాలో హీరో శింబుతో పాటు పోలీస్ క్యారెక్టర్ లో ఎస్.జె. సూర్య యాక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో.. పొలిటికల్ ట్విస్ట్ లతో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరపై ప్రెజెంట్ చేశాడు వెంకట్ ప్రభు. అయితే.. గతేడాది నవంబర్ 25న మానాడు రిలీజ్ కాగా.. సినిమా రిలీజై ఏడాది పూర్తవడంతో చిత్రబృందం ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. మానాడు వన్ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు. కాగా.. ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతుందని చెప్పకనే చెప్పారు మేకర్స్. ‘లూప్ త్వరలోనే కొనసాగుతుంది’ అంటూ పోస్టర్ షేర్ చేశారు.
ప్రస్తుతం మానాడు సీక్వెల్ ఉందని తెలిసేసరికి ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లేకి, యువన్ శంకర్ రాజా మ్యూజిక్, శింబు – సూర్యల పెర్ఫార్మన్స్ అన్ని సినిమా విజయంలో మెయిన్ రోల్ ప్లే చేశాయి. అయితే.. నవంబర్ 27న మరోసారి చెన్నైలో మేకర్స్ మానాడు స్పెషల్ షో వేయనున్నారని సమాచారం. అలాగే అందులోనే క్లైమాక్స్ లో సీక్వెల్ పై అధికారిక అప్ డేట్ ఇవ్వనున్నట్లు చెబుతున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇదిలా ఉండగా.. మానాడు సినిమాని తెలుగులో హీరో రానా లేదా నాగచైతన్యతో రీమేక్ చేయనున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. కానీ.. వెంకట్ ప్రభు నాగచైతన్యతో ‘కస్టడి’ అనే మూవీ చేస్తున్నాడు. చూడాలి మరి మానాడు సీక్వెల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో!
So #Maanaadu 2 coming soon 😉🔥#1YrOfMegaBBMaanaadu pic.twitter.com/KUqJDjThLp
— AmuthaBharathi (@CinemaWithAB) November 25, 2022
#1YrOfMegaBBMaanaadu
Stardom of #Atman elevated to Peak 💥
Unforgettable FDFS experience of #STR movie
Kudos to @SilambarasanTR_ @vp_offl @iam_SJSuryah & #Maanaadu Team pic.twitter.com/b1LxMtBGly— Ram Muthuram Cinemas (@RamCinemas) November 25, 2022