ఎం ఎస్ ధోని విలన్ గా చెయ్యబోతున్నాడు. మన ఇండియా క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించే చెప్తున్నానా లేక ఇంకో ధోని ఎవరైనా ఉన్నారా అని అనుకుంటున్నారా? 100 పర్సెంట్ ఇండియన్ క్రికెట్ ని ప్రపంచ క్రికెట్ లో నెంబర్ వన్ గా తీర్చిదిద్ది ఇండియాకి రెండోసారి ప్రపంచ కప్ ని అందించిన ఎం ఎస్ ధోనినే.
కోలీవుడ్ సూపర్ స్టార్ తలపతి విజయ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు అభిమానులకి పండగే.ప్రస్తుతం తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో "లియో" సినిమా చేస్తన్నాడు. అయితే తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు విజయ్. ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
సినిమా రిలీజ్ కి రెడీగా ఉందంటే చాలు ఎలాంటి లీకులు లేకుండా చూస్తారు. కానీ నాగచైతన్య 'కస్టడీ' విషయంలో మాత్రం డైరెక్టరే మొత్తం స్టోరీ లీక్ చేశాడు. ఇప్పుడు ఇది కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది.
ఐపీఎల్ లో మ్యాచులు ఎంతో ఉత్కంఠగా సాగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ ల విషయంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు, నాగ చైతన్య గొడవకు దిగారు. చెన్నై గెలుస్తుందని వెంకట్ ప్రభు, హైదరాబాద్ గెలుస్తుందని నాగ చైతన్య మాటల యుద్ధం మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మధ్యకాలంలో హిట్టయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది మామూలే అయిపోయింది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో త్వరలోనే మరో బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ రాబోతుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో శింబు హీరోగా తెరకెక్కిన సినిమా ‘మానాడు’. గతేడాది తమిళనాడులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు వసూల్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా టైమ్ […]