సినిమా రిలీజ్ కి రెడీగా ఉందంటే చాలు ఎలాంటి లీకులు లేకుండా చూస్తారు. కానీ నాగచైతన్య 'కస్టడీ' విషయంలో మాత్రం డైరెక్టరే మొత్తం స్టోరీ లీక్ చేశాడు. ఇప్పుడు ఇది కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది.
ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్.. ఇలా ఏ ఒక్కటి రిలీజ్ చేసినా చాలు మూవీ స్టోరీ ఏంటనేది చాలా ఈజీగా పట్టేస్తున్నారు. అయినాసరే హీరో దగ్గర నుంచి దర్శకనిర్మాతల వరకు సినిమా థియేటర్లలోకి వచ్చేంతవరకు స్టోరీ విషయంలో సస్పెన్స్ మెంటైన్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ దీన్నే ఫాలో అవుతుంటారు. కానీ నాగచైతన్య హీరోగా చేసిన ‘కస్టడీ’ స్టోరీ మొత్తం పూర్తిగా బయటపెట్టేశారు. ఈ విషయం ఇప్పడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే దీంతో ప్లస్, మైనస్ రెండూ ఉంటాయి. ఇంతకీ ఏం జరిగింది?
అసలు విషయానికొస్తే.. అక్కినేని హీరోలకు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. గతేడాది దసరాకు ‘ద ఘోస్ట్’ మూవీతో నాగార్జున థియేటర్లలోకి వచ్చారు. ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ.. ఓవరాల్ గా ఫెయిలైంది. రీసెంట్ గా అఖిల్ ‘ఏజెంట్’గా వచ్చాడు. దారుణమైన టాక్ తో అట్టర్ ఫ్లాప్ అనిపించుకుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అందరూ చైతూ ‘కస్టడీ’ కోసం తెగ వెయిట్ చూస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో మాట్లాడిన డైరెక్టర్ వెంకట్ ప్రభు.. కథ మొత్తం బయటపెట్టేశారు.
’16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తెలుగులో నాకు ఇదే ఫస్ట్ మూవీ. ఇది కంప్లీట్ యాక్షన్ అండ్ ఇంటెన్స్, ఎమోషనల్ మూవీ. రియల్ యాక్షన్ ఫీల్ కలిగిస్తుంది. ఈ సినిమా గురించి ఒక్క లైన్ లో చెప్పాలంటే.. విలన్ చనిపోకుండా హీరో చూసుకోవాలి. నార్మల్ గా ప్రతి మూవీలోనూ విలన్ ని చంపాలని హీరో అనుకుంటాడు. హీరోని చంపాలని విలన్ అనుకుంటాడు. కానీ ఇందులో మాత్రం విలన్ ని హీరో కాపాడాలి. ఛాన్స్ దొరికితే ఒకరినొకరు చంపాలనేంత కోపముంటుంది. కానీ హీరోకి విలన్ ని రక్షించడం తప్ప మరో ఛాయిస్ ఉండదు’ అని డైరెక్టర్ వెంకట్ ప్రభు చెప్పారు. చివరగా ‘మానాడు’తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన ఈ దర్శకుడు మేకింగ్ తో మెస్మరైజ్ చేస్తుంటాడు. బహుశా అందుకే స్టోరీ మొత్తం బయటపెట్టేసినట్లున్నాడు. ఇలా చెప్పేస్తే.. ఎంతమంది సినిమాకు వెళ్తారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారిపోయింది.
In most films, the hero & villain want to kill each other but in #Custody, the hero has no choice but to protect the villain. It is a very intense, realistic action film. – #VenkatPrabhu pic.twitter.com/MjILqqVaFW
— Aakashavaani (@TheAakashavaani) May 3, 2023