కోలీవుడ్ సూపర్ స్టార్ తలపతి విజయ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు అభిమానులకి పండగే.ప్రస్తుతం తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో "లియో" సినిమా చేస్తన్నాడు. అయితే తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు విజయ్. ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
కోలీవుడ్ సూపర్ స్టార్ తలపతి విజయ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు అభిమానులకి పండగే. తన నటనతో ఎనలేని అభిమానం సంపాదించుకున్న ఈ కోలీవుడ్ స్టార్ తన తర్వాత సినిమా ఎవరితో చేస్తాడనే విషయంలో గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో చాలా డైరెక్టర్లు విజయ్ తో సినిమా చేస్తున్నాడని రకరకాల ఊహాగానాలు వినిపించినప్పటికీ.. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు విజయ్. ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మరి విజయ్ తన తర్వాత సినిమా ఎవరితో ఇప్పుడు చూద్దాం.
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ ఈ సంక్రాంతికి వారసుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు దర్శకుడు వంశి పైడిపల్లి తెరకెక్కించడం విశేషం. ఈ సినిమా విజయం సాధించడంతో తెలుగులో విజయ్ మార్కెట్ పెరిగింది. ఇక ఆ తర్వాత తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాకి కమిట్ అవ్వడంతో “లియో” సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా విజయ్ కెరీర్ లో 67 వది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ మరోసారి వంశీకి ఛాన్స్ ఇస్తాడనే ప్రచారం గట్టిగా జరిగింది. అంతేకాదు గోపీచంద్ మలినేని తో సినిమా ఫిక్స్ అయినట్లు దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ఇక ఈ లిస్టులో తమిళ స్టార్ డైరెక్టర్లు అట్లీ, శంకర్ కూడా ఉన్నారు. అయితే వారందరికీ షాకిస్తూ విజయ్ వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించేశాడు. వెంకట్ ప్రభు ఇటీవలే హీరో నాగ చైతన్యతో తెలుగులో కస్టడీ సినిమా చేసాడు. ఎంతో అనుభవం ఉన్న ఈ తమిళ దర్శకుడు గతంలో విజయ్ తో శివకాశి సినిమాని కూడా చేసాడు. ఒక న్యూస్ పేపర్ లో.. పెన్ ద్వారా ఈ సినిమాలో డైరెక్టర్, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ పేర్లను రౌండ్ చేస్తూ చాలా స్పెషల్ గా ఈ సినిమా గురించి అప్ డేట్ ఇవ్వడం విశేషం. ఈ సినిమాని AGS ఎంటర్ టైన్ మెంట్ నిర్మించగా.. యువన్ శంకర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. మొత్తానికి విజయ్ చాలా కాలం తర్వాత తన 68 వ సినిమా సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Next… pic.twitter.com/iw1M5Dy7x9
— Vijay (@actorvijay) May 21, 2023