‘మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్’ RRR తర్వాతి ప్రాజెక్టు పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో కియారా అద్వానీ చరణ్‌తో మరోసారి జోడీ కట్టనుంది. ఎస్ తమన్ సంగీతం అందించనున్నాడు. ఈ భారీ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా దిల్‌రాజుకు కూడా చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇది వారి నిర్మాణ సంస్థ యాభయ్యో చిత్రం. ‘RC 15’ వర్కింగ్ టైటిల్‌తో ప్రాజెక్టు పూజా కార్యక్రమం కూడా జరిగింది. రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్, రాజమౌళి, రణ్‌వీర్ సింగ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ప్రాజెక్టు కాస్ట్ అండ్ క్రూ వివరాలు తెలిసేలా అందరూ సూట్‌లు ధరించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
అది అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఆ పోస్టర్ హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఒక్క పోస్టర్ కోసమే డైరెక్టర్ శంకర్ అక్షరాల కోటీ 73 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని బోగట్టా. ఒక్క పోస్టర్‌కే అంత ఖర్చు పెడితే మరి పూర్తి సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో అన్న టాక్ స్టార్ట్ అయ్యింది. ఈ ప్రాజెక్టుకు ముందు అనుకున్న బడ్జెట్ రూ.250 కోట్లు. శంకర్ అక్కిడితో ఆగడు అంటూ అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమా కచ్చితంగా శంకర్, రామ్‌చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కాబోతోందంటూ మాట్లాడుకుంటున్నారు. శంకర్ సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్‌కు కొదవే ఉండదు. ప్రతి సినిమాలో ఓ మెసేజ్ తప్పకుండా ఇస్తాడు శంకర్. ఈ సినిమా కూడా అలాగే ఉండబోతోందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.
అటు రామ్‌చరణ్, ఇటు దిల్‌రాజు, మరోవైపు శంకర్ అందరికీ ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కాబట్టి తప్పుకుండా మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని చెప్పేయచ్చు. శంకర్ అంటేనే టెక్నాలజీ.. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఒక్క రోబో సినిమా చాలు. 2010లోనే భారీ బడ్జెట్, గ్రాఫిక్స్‌తో సినిమా తీసిన శంకర్.. సాంకేతికత ఇంతగా పెరిగిన ఈ రోజుల్లో ఏ రేంజ్‌లో ఉండబోతోందా అని అభిమానులు చాలా ఆతురతగా ఉన్నారు. శంకర్ గురించి తమన్ చేసిన ట్వీట్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ‘ఆయన అంచనాలను అందుకోవాలంటే నాకు టైమ్ మెషిన్ కావాలి. ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలంటే మన టెక్నాలజీ చాలదు.. ఏలియన్ టెక్నాలజీ కావాల్సిందే’ అంటూ తమన్ పెట్టిన ట్వీట్ చూస్తే ఈ సినిమా కచ్చితంగా శంకర్ కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని తెలుస్తోంది.
I Had to Take a Time Machine to Catch his Ears He His a Great Human with overflowing ideas Which Are technically far beyond & From an Alien Space 🚉🕺🏾Wishing mY dear Mentor @shankarshanmugh Sir a Huge Success & I Am Honoured to be Part of his Technical Team 🎧💿🎬#RC15Begins pic.twitter.com/k0QySuTS5Y
— thaman S (@MusicThaman) September 8, 2021