సాధారణంగా సోషల్ మీడియా వాడకం పెరిగాక.. అటు వెండితెర నటులు.. ఇటు బుల్లితెర నటులు అభిమానులకు చాలా దగ్గరైయ్యారు. వారి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా అభిమానులతో చిట్ చాట్ లు కూడా చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ అడుగు మరింత ముందుకు వేసింది బుల్లితెర సోయగం అషు రెడ్డి. తన హాటైన అందాలతో సోషల్ మీడియాను ఘాటెక్కిస్తోంది. మెున్న ఈఫిల్ టవర్ ముందు బ్యాక్ అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించిన అషు రెడ్డి.. నిన్న వైట్ డ్రెస్ లో దారాలతో అందాలనే కాకుండా యువకుల గుండెలను సైతం బంధించింది. ఈ సారి మినీ స్కర్ట్ లో డ్యాన్స్ చేసి రచ్చ లేపింది.
అషు రెడ్డి అందాల విందు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. వెకేషన్ లో ఉన్న అషు రెడ్డి.. తాజాగా లండన్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హో జాయేగి బల్లే బల్లే అనే హిందీ పాటకు దొస్తులతో కలిసి స్టెప్పులేసింది ఈ బిగ్ బాస్ సోయగం. పొట్టి స్కర్ట్ లో థైస్ అందాలతో పాటుగా హాట్ హాట్ క్లీవేజ్ షో చేస్తూ.. అందాల విందును అభిమానులకు అందించింది. మెరూన్ కలర్ స్కర్ట్ లో డ్యాన్స్ చేసి కుర్రాళ్లకు తన ఒంపు సొంపులతో పిచ్చెక్కింది. పొట్టి స్కర్ట్ లో డ్యాన్స్ చేస్తూ ఇబ్బంది పడింది అమ్మడు. మధ్య మధ్యలో డ్రెస్సును సరిచేసుకుంటూ దోస్తులతో కలిసి చిందేసింది.
అయితే అషు రెడ్డి డ్రెస్సుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అషు రెడ్డి ఆ డ్రెస్ ఏంటి అసలు? మీ ఇంట్లో వాళ్లు నిన్ను పట్టించుకోవడం లేదా? నువ్వే వాళ్లని వదిలేశావా? అంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి డ్రెస్సు వేసుకోవడం ఎందుకు? మధ్య మధ్య లో సరిచేసుకోవడం ఎందుకు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఓ అభిమాని అయితే యూకే లో మరీ ఇలా డ్రెస్సులు వేసుకోరు.. ఈ రీల్ చూశాక నిన్ను అన్ ఫాలో అవుతున్నా గుడ్ బై అంటూ కామెంట్స్ లో రాసుకొచ్చింది. అవకాశాల కోసం మరీ ఇంతలా దిగజారాలా? ఈ డ్యాన్స్ ఏంటీ.. ఆ డ్రస్సు ఏంటీ? అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే ఇలాంటి కౌంటర్లకు ఘాటుగా రీ కౌంటర్లు ఇవ్వడం అషు రెడ్డికి అలవాటే. మరి ఈ విమర్శలకు, ట్రోల్స్ కు అషు రెడ్డి ఏవిధంగా సమాధానం చెబుతుందో వేచిచూడాలి.