ఆరియానా గ్లోరీ యూట్యూబ్ యాంకర్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది. అనంతరం బిగ్ బాస్ షోలో పాల్గొన్ని మంచి గుర్తింపు సంపాందించింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న లేడీగా మారిపోయింది ఈ బ్యూటీ. దీంతో ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్‌తో పాటు ఎన్నో ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆరియానాకు ఓ నెటిజన్ షాకిచ్చాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!
ఆరియానా గ్లోరీ యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఆరియాన ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఆయనతో ఆమె బోల్డుగా చర్చలు జరపడంతో హైలైట్ అయింది. ఆ తర్వాత ఆర్జీవీ.. ఆరియానాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి ఆమె ఎంతగానో ఫేమస్ అయిపోయింది.బిగ్ బాస్ షో ద్వార మరింత గుర్తింపు సంపాదించింది. ఈ షో పుణ్యమా అని ఆరియానా ఎంతో ఫేమస్ అయింది. అంతేకాదు, వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు ఇలా ఫుల్ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. పలు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ సినిమాల్లో నటించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఆరియనా యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్టు పెడుతూ నెట్టింట్ హల్చల్ చేస్తోంది.
ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫాలోవర్లతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆరియానాకు ఐలవ్యూ కూడా చెప్పేశాడు. ‘ఆరియానా ఐలవ్యూ. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం’ అని అంటూనే ‘నీ కోతి వాయిస్ చాలా బాగుంటుంది’ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీనికి ఆరియానా నవ్వుతూనే సమాధానం చెప్పింది. అంతేకాదు, సదరు నెటిజన్ ప్రేమకు పొంగిపోతూ ధన్యవాదాలు తెలియజేసింది. మరి.. అరియానాకు నెటిజన్ లవ్ ప్రపోజ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.