దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే తాను ప్రేమించిన దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరూ హానీమూన్ కి వెళ్లొచ్చారు. అలాగే హనీమూన్ నుండి రాగానే నయన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. అయితే.. ఇటీవల నయన్ అస్వస్థతకు గురైందని పలు వార్తలు సినీ వర్గాలలో వైరల్ అవుతోంది. నయన్ కి వాంతులు అయ్యాయని.. ఆ వెంటనే ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.
మరి అసలు నయన్ కి ఏమైంది? వాంతులు కావడానికి కారణం ఏంటనే వివరాల్లోకి వెళ్తే.. నయన్ త్వరలోనే శుభవార్త చెప్పబోతుందని అభిప్రాయపడుతూ ఆనందంలో మునిగి తేలుతున్నారు ఫాన్స్. కానీ.. అసలు విషయం ఏమిటంటే.. భర్త విగ్నేష్ శివన్ వండిన వంట తినడం వలన నయన్ కి వాంతులు అయ్యాయని, దీంతో కొన్ని గంటలపాటు అబ్జర్వేషన్ లో ఉంచిన వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారని కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా.. కొందరు మాత్రం నయన్ స్కిన్ ఇన్‌ఫెక్షన్ వల్లే ఆస్పత్రికి వెళ్లిందని అంటున్నారు. మరి నయన్ అస్వస్థతకు అసలు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. దీనిపై నయన్ లేదా విఘ్నేశ్ లలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. ఇక నయన్ – విగ్నేష్ ల పెళ్లి వీడియోను త్వరలోనే నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ చేయనున్నారు. వీరి పెళ్లికి సంబంధించి ఇప్పటికే ఓ ప్రోమో రిలీజ్ చేశారు. మరి పూర్తి వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారో వెయిట్ చేయాల్సిందే. ఇక నయన్, విగ్నేష్ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.