అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ చిత్రం.. ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున అఖిల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..
అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. అయితే ఇప్పటివరకు అఖిల్ ఖాతాలో సాలిడ్ హిట్ లేదు. ఇక తాజాగా అఖిల్.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఏజెంట్’చిత్రంలో నటిస్తున్నాడు. అఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 23న అనగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. వరంగల్‌లోని రంగలీలా మైదానంలో గ్రాండ్‌గా జరిగిన ప్రీరీలిజ్ వేడుకకు అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అంతేకాకుండా జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. అఖిల్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు.. .
నాగార్జున మాట్లాడుతూ.. ‘‘అఖిల్ ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను వాళ్లమ్మ కడుపులో ఉండగానే.. తన ఎనర్జీ లెవల్స్ ఏంటో మాకు చూపించాడు. కడుపులో ఉన్నపుడు అఖిల్ వాళ్ల అమ్మను బాగా ఇబ్బంది పెట్టాడు. తనకు 8 నెలల వయసు ఉన్నపుడే విపరీతమైన ఎనర్జీ ఉండేదని.. పడుకోకుండా ఎప్పుడూ పరుగెత్తుతూ ఉండేవాడు. దాంతో మేం కంగారు పడి.. తనను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే.. ఆయన అఖిల్‌ను సాయిల్ మీద పడుకోబెట్టమని సలహా ఇచ్చారు. అలా తనలోని ఎనర్జీని బయటకు లాగాలని సూచించారు. ఈ సినిమాలో కూడా అఖిల్ ఎనర్జీని డైరెక్టర్ సురేందర్ రెడ్డి అలానే బయటకు తీశారు. ఇక మేం యంగ్ ఏజ్‌లో ఇలాంటి సిక్స్‌ప్యాక్‌లు వంటివి లేవు. దానికి నిజంగా థాంక్స్ చెప్పుకోవాలి. లేదంటే ఇంత కష్టం మా వల్ల అయ్యేది కాదు’’ అన్నారు.
అలానే ఈ సినిమా కథ వినగానే ఒప్పుకున్న మలయాళ మెగాస్టార్ మమ్మట్టికి థాంక్స్ చెప్పారు నాగార్జున. ఆయన ఒప్పుకున్నారంటే సినిమా హిట్ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు కొన్నిరోజుల క్రితమే వాళ్ల అమ్మ చనిపోయారని, అయినప్పటికీ సినిమా రిలీజ్‌కు ఇబ్బంది ఉండకూడదని డబ్బింగ్ ఫినిష్ చేశారంటూ ముమ్మట్టి గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. అంతేకాక వరంగల్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సహకరించిన మంత్రి ఎర్రబెల్లికి థాంక్స్ చెప్పారు నాగార్జు. అంతేకాక వరంగల్‌లో ఫంక్షన్ జరుపుకున్న సినిమాలన్నీ హిట్ అయ్యాయని.. ఇక ‘ఏజెంట్’ హిట్టేనని నాగార్జున ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో పాటు తమకు సెక్యూరిటీ కల్పించిన పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు కూడా థాంక్స్ చెప్పారు.